3, జనవరి 2025, శుక్రవారం

Aaradhana : Ohoho Mamayya Song Lyrics (ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.)

చిత్రం: ఆరాధన (1962 )

రచన:  ఆరుద్ర

గానం:  ఘంటసాల, పి.సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

పల్లవి :

ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా
ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా
ఇంటిని విడిచి షికారు కొడితే ఎంతో హాయి కలదయ్యా
ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ.. బలెబలె బతికిన కాలేజి
ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ.. బలెబలె బతికిన కాలేజి
మాటలు రాని మృగాలు కొన్ని మనిషి కి పాఠం చెబుతాయి 

చరణం 1:

పులులూ చిరుతలు సింహాలన్నీ వెలుపల తిరిగిన ప్రమాదమే..
ఓ మావయ్యా మావయ్యా
కొందరు ఘరాన మనుషులకన్నా క్రూరము కావీ జంతువులు..
ఓ అమ్మాయీ.. అమ్మాయీ
శౌర్యం పెరిగిన మనిషిని మృగాన్ని కటకటాలలో పెడతారు
ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా
ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా

చరణం 2 :

గుర్రపు అంశం గాడిద వంశం చారల చారల జీబ్రావి
చుక్కల జిరాఫి ఒంటెకు బంధువు.. మనిషికి బంధువు చింపాంజిపంజి
మనిషి చేష్టలు కోతులకుంటే .. కోతి చేష్టలు కొందరివి..
వా...ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ..బలెబలె బతికిన కాలేజి

చరణం 3 :

తీరున తిరిగే నోరును తెరిచే ఏనుగు లాంటిది ఏమిటది..
ఓ మావయ్యా.. మావయ్యా
ఏనుగు వంటిది నీటిగుర్రము.. దానికి తమ్ముడు ఖడ్గమృగం
అధికులు పేదల కాల్చుకు తింటే.. ఇవి ఆకూ అలమే తింటాయి
ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా

చరణం 4 :

రాజులు ఎక్కే అంబారీపై అందరు ఎక్కుట తప్పు కదా
రోజులు మారాయ్ž రాజులు పోయి ప్రజలే ప్రభువులు ఈనాడు..
అహ.. ప్రజలే ప్రభువులు ఈనాడు
మనుషుల పైన సవారికన్నా.. ఏనుగు సవారి నయం కదా
ఆ నిజం నిజం .. అహ మజా మజా
ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా
ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ... బలెబలె బతికిన కాలేజి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి