3, జనవరి 2025, శుక్రవారం

Aaradhana : Na Hrudayamlo Nidurinche Cheli Song Lyrics (నా హృదయంలో నిదురించే చెలి)

చిత్రం: ఆరాధన (1962 )

రచన:  శ్రీ శ్రీ

గానం:  ఘంటసాల

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు




పల్లవి :

నా హృదయంలో నిదురించే చెలి
కలలలోనే కవ్వించే సఖి
మయూరివై వయ్యారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే


నా హృదయంలో నిదురించే చెలి 


చరణం 1 :

నీ కన్నులలోన దాగెనులే వెన్నెల సోన
కన్నులలోన దాగెనులే వెన్నెల సోన
చకోరమై నిను వరించి అనుసరించినానే..  కలవరించినానే


నా హృదయంలో నిదురించే చెలీ 


చరణం 2 :

నా గానములో నీవే ప్రాణముగ పులకరించినావే ..
ప్రాణముగా పులకరించినావే.. పల్లవిగా పలుకరించ రావే..
పల్లవిగా పలుకరించ రావే


నీ వెచ్చని నీడ.. వెలసెను నా వలపుల మేడ
వెచ్చని నీడ.. వెలసెను నా వలపుల మేడ
నివాళితో చేయి సాచి ఎదురు చూచినానే.. నిదురకాచినానే
నా హృదయంలో నిదురించే చెలి
కలలలోనే కవ్వించే సఖి
మయూరివై వయ్యారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే


నా హృదయంలో నిదురించే చెలి 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి