చిత్రం: అన్నమయ్య(1997)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
రచన: జె. కె. భారవి
గానం: మనో
ఓం శ్రీ పద్మావతీ భూదేవీ సమేతస్య శ్రీమద్ వేంకట
నాయకస్య నిత్య షోడశోపచార పూజాం కరిష్యే! ఆవాహయామి!
పదహారు కళలకు ప్రాణాలైన
నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం
ఓం ఆసనం సమర్పయామి!
పరువాల హొయలకు పైయెదలైన
నా ఊహల లలనలకు ఊరువుల ఆసనం
ఓ స్నానం సమర్పయామి!
చిత్తడి చిరు చెమటల చిందులు చిలికే
పద్మినీ భామీనులకు పన్నీటి స్నానం
ఓం గంధం సమర్పయామి!
ఘలం ఘలల నడల వలన అలసిన
మీ గగన జఘన సొభగులకు శీతల గంధం
ఓం నైవేద్యం సమర్పయామి!
రతి వేద వేద్యులైన రమణులకు అనుభవైక వేద్యమైన నైవేద్యం
ఓం తాంబూలం సమర్పయామి!
మీ తహతహలకు తపనలకు తాకిళ్ళకు ఈ కొసరు కొసరు తాంబూలం
ఓం సాష్టాంగ వందనం సమర్పయామి!
అనంగ రంగ భంగిణులకు సర్వాంగ చుంబనాల
వందనం!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి