చిత్రం : అన్నదమ్ముల సవాల్ (1978)
సంగీతం: సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
పల్లవి:
అరెరెరే.. గువ్వగూడెక్కే.. రాజు వేడెక్కే.. కళ్ళు కైపెక్కే.. ఒళ్ళు వేడెక్కే
దిగి వస్తే చిన్నదానా... నీ సొగసంతా దోచుకోనా
హే దిగి వస్తే చిన్నదానా... నీ సొగసంతా దోచుకోనా
గువ్వగూడెక్కే.. రాజు వేడెక్కే.. కళ్ళు కైపెక్కే..వళ్ళు వేడెక్కే
ఎగిరొస్తే అందగాడా.. నే సగమిస్తా సందెకాడా
హేయ్.. ఎగిరొస్తే అందగాడా.. నే సగమిస్తా సందెకాడా
చరణం 1:
పడుచు పరపు నలగనన్నదీ.. నా పక్కన నువ్వులేకా..
మగ సెగలే రగులుతున్నవీ.. నీ ఆడ గాలి నన్ను తాకా..
ముద్దులేదు పొద్దులు పోకా..
నీవు రాకా నిద్దుర రాకా .. హా
ముద్దులేదు పొద్దులు పోకా..
నీవు రాకా నిద్దుర రాకా...
కరిగింది కంటి కాటుకా.. ఆ...
గువ్వగూడెక్కే.. రాజు వేడెక్కే.. కళ్ళు కైపెక్కే.. ఒళ్ళు వేడెక్కే
ఎగిరొస్తే అందగాడా.. నే సగమిస్తా సందెకాడా
ఆహాహాహా.. దిగి వస్తే చిన్నదానా... నీ సొగసంతా దోచుకోనా
చరణం 2:
పెదవులు తడి ఆరుతున్నవీ.. నీ పెదవులతో ఎంగిలి పడకా..
వయసు మిడిసి పడుతు ఉన్నదీ.. నువ్వు ఒడిసి పట్టు ఒడుపే లేకా..
హేయ్.. రేగితే ఆగదు తిక్కా..
మబ్బు మీద వెయ్నా పక్కా
రేగితే ఆగదు తిక్కా..
మబ్బు మీద వెయ్నా పక్కా
రగిలింది కొంటె కోరికా.. ఆ.. హా
గువ్వగూడెక్కే.. రాజు వేడెక్కే.. కళ్ళు కైపెక్కే.. ఒళ్ళు వేడెక్కే
దిగి వస్తే చిన్నదానా... నీ సొగసంతా దోచుకోనా
హేయ్.. ఎగిరొస్తే అందగాడా.. నే సగమిస్తా సందెకాడా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి