చిత్రం : యానిమల్ (2023)
సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్
గీత రచయిత : అనంత శ్రీరామ్
నేపధ్య గానం : సోను నిగమ్
పల్లవి:
నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే
నా కన్నులకి నువ్వు వెన్నలవి నా ఊపిరివి నువ్వే
నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి
నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదటా ఆ మాట
నాన్న నీకై ప్రాణం ఇవ్వనా ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా అనేదేలా ఇవ్వాలా నీ ఎదుటా
చరణం 1:
నీ చేతులలో ఊయలలుగే ఆ సంబరం ఇంకెప్పుడు
నీ భుజములపై తలవాల్చుకునే ఆ పండుగ నాకెప్పుడూ
క్షణానికో సవాలిలా జవాబు లేదెపుడు
నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదటా ఆ మాట
నాన్న నీకై ప్రాణం ఇవ్వనా ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా అనేదేలా ఇవ్వాళా నీ యెదుటా
చరణం 2:
నీ కానుకలో నీ లలనాతో సరితూగవు ఇది నిజమా
నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై
జగాలనే జయించినా తలొంచి నీ వెనకే
నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదటా ఆ మాట
నాన్న నీకై ప్రాణం ఇవ్వనా ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా అనేదేలా ఇవ్వాళా నీ యెదుటా
చరణం 3:
ఈ జన్మవని ఏ జన్మవని తీరాలి రుణం మనకి
ఏ జన్మకి నువ్వు నా నాన్న వలె వస్తావట నా దరికి
ఇదే మనం ఇదే శుభం మనిద్దరి ఈ కథకి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి