Animal లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Animal లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జనవరి 2025, మంగళవారం

Animal : Kashmeeru Song Lyrics (కాశ్మీరులాంటి సీమలలో)

చిత్రం : యానిమల్ (2023)

సంగీతం : మనన్ భరద్వాజ్

గీత రచయిత : అనంత శ్రీరామ్

నేపధ్య గానం : శ్రేయ ఘోషల్, యాజిన్ నిజార్



చిరుగాలి వీచేలా ఈ మేడలో ఎక్కడా ఏ దారి లేదేంటో సెలయేరు పారేలా ఈ తోటలో ఎక్కడా ఏ వాలు లేదేంటో ఇటువంటి చోటులలో కమ్మే సెగలలో ప్రేమనిలా పూయించాలో ఏంటో ఇవాళే ఇవాళే అలా వాలిపోదా కాశ్మీరులాంటి సీమలలో ఆ రోజులాగే అలా తేలిపోదా జీలమ్మనల్లాంటి ప్రేమలలో మ్ అందాల లోయ చేసేటి మాయ జతగా మరోసారి చూద్దాం ప్రియా చెబుతారు ప్రతి ఒకరు నేలపైన ఉండే స్వర్గం అదంట పోదాం పదా ఆ మంచు కనుమల్లో నేర్పించమంటే నేర్పిస్తా ప్రేమంటే ఏంటో ప్రపంచాన్ని మరచి కాసేపు ఊగిపోదాం దేవకన్యలుండే ఆ గ్రామములో ఆ జ్ఞాపకాలు పోగు చెయ్యి చాలు లోటనేది ఉండదిక నీ మదిలో నువ్వు అడిగితే తీసుకెళ్ళనా ఆ చోటులోన చలి ఉంది చానా వణుకుతూ నీవుంటే చూస్తూ అలా ఎలా తాలనే అయ్యో లేడీ కూన చలిమంటలై నన్ను నీ మాటలే తాకుతుంటే చలేస్తాదా ఏంటో నీ కౌగిలే నన్ను ఓ కంబలై కాచుకుంటే వణుకుతానా ఏంటో నా ముందు నువ్వుండి మాటాడుతుంటె కదిలే కాలాన్నే ఆపేయనా ఆ గూటి పడవల్లో నీ గుండెపై వాలి నిదురిస్తా నేడే ఆ సీమలలో ఏదేమి అవుతున్నా ఏ గొంతు ఏమన్నా తేలుస్తా నిన్నే నా ప్రేమలలో

Animal : Ammayi Song Lyrics (నింగి నేల)

చిత్రం : యానిమల్ (2023)

సంగీతం : జామ్8

గీత రచయిత : అనంత శ్రీరామ్

నేపధ్య గానం : రాఘవ్ చైతన్య, ప్రీతమ్


పల్లవి:

నింగి నేల నీలా నాలా కలిసాయే ఏకాంతం తప్పా నీతో నాతో ఏది తోడు రాలా ఏంటి ఈ వేలా ఇది మాయే..ప్రాణం చాటుల్లో ఉండే ఈ ప్రణయం పైపైకొచ్చి పెదవంచుల్లో మోగించిందే తీపి సన్నాయి అమ్మాయి అమ్మాఈ.. ఈ హాయి మేఘమా మైకమా.. కమ్మేటి ఈ హాయే లోకమా అమ్మాయి

చరణం 1: గీతాంజలి నా జాబిలీ నా శ్వాస తోనే నీకు ఇలా ఇలా ముడేసిన పదే ఉశ్వాసలో నిశ్వాసలో నీ వెంట నేనే చివరి శ్వాస కి ఇదే ఇదే స్థితే హత్తుకోవే హల్లుకోవే నీ నన్నే నేనే నీకన్నీ అవుతానే మూడో మనిషే నీకు గురుతే రాని సంతోషాన్నిస్థనే అమ్మాయి అమ్మాయి అమ్మాఈ ఈ రేయి కాలమా జాలమా సాగేటి ఈ రేయే స్వర్గమా అమ్మాయి అమ్మాయి

Animal : Ney Veyrey Song Lyrics (నా దేహామంత)

చిత్రం : యానిమల్ (2023)

సంగీతం : శ్రేయాస్ పురాణిక్

గీత రచయిత : అనంత శ్రీరామ్

నేపధ్య గానం : కార్తీక్


పల్లవి:

ఓ ఓ.. నా దేహామంత నీ స్నేహం తో నిండింది చూడే నేస్తమా ఓ.. నా మౌనమంతా నీ ద్యానంలో మునిగింది చూడే ప్రాణామా నా చిన్ననాటి గుండె నీ పేరే వినిపిస్తుందే నా కన్న నిన్ను ముందే చదివేసి ఇటు చేరుకుందే నే వేరే నువు వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణామా నే వేరే నువు వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణామా ఓ.. ఓ..

చరణం 1:

నీ పాదం స్పృశించాకే నే తాకనే నీ పెదవిని నీ ద్వేషాన్ని ముందుగా కలిసి మళ్ళీ చూస్తా నీ ప్రేమనే కసిరినిదా కనికరమా అలకలమ అటునా అనురాగమ శిశిరాల జాడలా ఎదురైన మరల రాదా మరుక్షణన వాసంతమే నీ చేదు జ్ఞాపకాలే గాయాలుగా మార్చుకుంటా నువు నుచ్చుకున్న చోటే నను నేను శిక్షించుకుంటా నే నావై నువు తోవైకానే నేస్తమా ఏ తీరం ఇక దూరం కాదు ప్రాణామా నే వేరే నువు వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణామా ఓ .. ఓ.. ఓ.. ఓ..

చరణం 2:

నేనేమో ఎండనయితే నువ్వేమో నా వాన విల్లే ఈ జంట ఉన్న చోటే వెలగాలల వాన వీల్లే నే రాత్రయి నువు పగలయితే నేస్తమా ప్రతి రోజు ఇక పూర్తయనే ప్రాణామా నే వేరే నువు వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణామా నే వేరే నువు వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణామా

Animal : Evarevaro Song Lyrics (ఎవరెవరో.. నాకేదురైనా..)

చిత్రం : యానిమల్ (2023)

సంగీతం : విశాల్ మిశ్రా

గీత రచయిత : అనంత శ్రీరామ్

నేపధ్య గానం : విశాల్ మిశ్రా



ఎవరెవరో.. నాకేదురైనా.. నువ్ కలిసాకే మొదలైందే..
మెలకువలో కలలా తూచి.. మరుజన్మేదో మొదలైందే..
ఏమో ఏం చేస్తున్నానో.. ఇంకా ఏమేం చేస్తానో..
చేస్తూ ఏం అయిపోతానో.. మరి..
ఎవరెవరో.. నాకేదురైనా.. నువ్ కలిసాకే మొదలైందే..
మెలకువలో కలలా తూచి.. మరుజన్మేదో మొదలైందే..

ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటే.. ప్రమాదం అనేదే ఇటే రాదే..
సముద్రాల కన్న సొగసెంత లోతే.. ఎలా ఈదుతున్నా ముంచేస్తోందో..
కాల్చుతు ఉన్నాదే కౌగిలే కొలిమిలా.. ఇది వరకు మనసుకు లేని...
పరవసమేదో.. మొదలైందే.. మెలకువలో కలలా తూచి.. మరుజన్మేదో.. మొదలైందే..

Animal : Yaalo Yaalaa Song Lyrics (ఓ యాలో యాలా యాలోరే…)

చిత్రం : యానిమల్ (2023)

సంగీతం : జానీ

గీత రచయిత : అనంత శ్రీరామ్

నేపధ్య గానం : అనురాగ్ కులకర్ణి


పల్లవి:

ఓ యాలో యాలా యాలోరే… ఓ యాలో యాలా యాలోరే… ఓ ఎన్నో యేండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఈ యాలె ఓ ఎన్నో యేండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఈ యాలె ఓ యాలో యాలా యాలోరే… ఓ యాలో యాలా యాలోరే… ఎన్నో యేండ్ల ఆకలికి యాటా మోద్ధలైందయ్యో ఈ యాలె ఎన్నో యేండ్ల ఆకలికి యాటా మోద్ధలైందయ్యో ఈ యాలె మండేటి ఎండల నుండి యెగసిపడే సూరీడుల వస్తా కమ్మేటి మబ్బులు కాల్చి నీ సుట్టు ఏన్నెల్లు పొంగిస్తా నింపేసుకుంటా నిన్ను నాలోనా అచ్చేసుకుంటా నిన్ను నా మీన మొక్కేది నిన్నే ఎపుడైనా నా సామి వంటే నువ్వే లోకానా సెమ్మా సేరదు మీ కంటా ఓ సెమ్మా సేరదు మీ కంటా అమ్మ తోడు నేనుండంగా మీకు ఆపదే రాదంటా ఓ పిడుగై నేనటే రానా ఓ బడాబాగ్నులు ఈదైనా భూమినైనా బుగ్గి సేసెయ్నా నీకు ఏమన్నైతే నాన్నా భూమినైనా బుగ్గి సేసెయ్నా నీకు ఏమన్నైతే నాన్నా

చరణం 1:

బతికేదే మీ కోసం ఈ బతుకే మీ దయా కోసం మీరే లేరనే ఓ మాట నిజం కాకున్నా నను సంపేయ్ దా అది అనేటి ఏ నోరైనా దాన్ని ఆడే తవ్వి పాతేయ్నా ఓ నువ్వు సేసిన బొమ్మనయా ఓ నువ్వు సేసిన బొమ్మనయా ఓ నువ్వే దాని పానమయా నీ పేరే దానిలయా ఓ నువ్వే దాని పానమయా నీ పేరే దానిలయా

చరణం 2:

తోడేలు నీకెల్లి తోకలను జాడిత్తే సింగమై రానా ఏటాడి ఎటులేసి నెత్తుటేర్లు పారించే నేలనైపోనా ఓ తోడేలు నీకెల్లి తోకలను జాడిత్తే సింగమై రానా అ ఏటాడి ఎటులేసి నెత్తుటేర్లు పారించే నేలనైపోనా నేలనైపోనా ఒక్క నిజం ఒప్పుకున్నా నాన్న ఒక్క నిజం ఒప్పుకున్నా నాన్న ఎంత దూరం ఎల్లె పోరైనా దెగ్గరోల్ల తోనే అవ్నా ఎంత దూరం ఎల్లె పోరైనా దెగ్గరోల్ల తోనే అవ్నా ఓ యాలో యాలా యాలోరే… ఓ యాలో యాలా యాలోరే… నీ సావునే సంపేసిందే నువ్వు పంచినా నీ నెత్తురే నీ సావునే సంపేసిందే నువ్వు పంచినా నీ నెత్తురే

Animal : Nanna Nuv Naa Pranam Song Lyrics (నా సూర్యుడివి నా చంద్రుడి)

చిత్రం : యానిమల్ (2023)

సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్

గీత రచయిత : అనంత శ్రీరామ్

నేపధ్య గానం : సోను నిగమ్


పల్లవి:

నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి
నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదటా ఆ మాట నాన్న నీకై ప్రాణం ఇవ్వనా ఇదిగో ఇది నా మాట నిజాన్నేలా అనేదేలా ఇవ్వాలా నీ ఎదుటా
చరణం 1:
నీ చేతులలో ఊయలలుగే ఆ సంబరం ఇంకెప్పుడు నీ భుజములపై తలవాల్చుకునే ఆ పండుగ నాకెప్పుడూ క్షణానికో సవాలిలా జవాబు లేదెపుడు నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదటా మాట
నాన్న నీకై ప్రాణం ఇవ్వనా ఇదిగో ఇది నా మాట నిజాన్నేలా అనేదేలా ఇవ్వాళా నీ యెదుటా
చరణం 2:
నీ కానుకలో నీ లలనాతో సరితూగవు ఇది నిజమా నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై జగాలనే జయించినా తలొంచి నీ వెనకే నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదటా మాట
నాన్న నీకై ప్రాణం ఇవ్వనా ఇదిగో ఇది నా మాట నిజాన్నేలా అనేదేలా ఇవ్వాళా నీ యెదుటా
చరణం 3:

ఈ జన్మవని ఏ జన్మవని తీరాలి రుణం మనకి ఏ జన్మకి నువ్వు నా నాన్న వలె వస్తావట నా దరికి ఇదే మనం ఇదే శుభం మనిద్దరి ఈ కథకి