11, జనవరి 2025, శనివారం

Chinnanati Snehitulu : Andala Sreemathiki Song Lyrics (అందాలా శ్రీమతికి . .)

చిత్రం: చిన్ననాటి స్నేహితులు (1971)

రచన:  సి.నారాయణ రెడ్డి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

సంగీతం: టి. వి. రాజు



పల్లవి :

అందాలా శ్రీమతికి . . మనసైనా ప్రియసతికీ
వలపుల కానుకగా . . ఒక పాపను నేనివ్వనా
మబ్బులలో విహరించే . . మా వారి అనురాగం
వాడని మందారం . . నా పాపట సిందూరం

చరణం 1:

మా బాబు నయనాలూ.. లేత జాబిల్లి కిరణాలు
మా బాబు నయనాలూ.. లేత జాబిల్లి కిరణాలు
వీడే ఇంతవాడె అంతవాడై.. వెలుగుతాడూ
 వీడే ఇంతవాడె అంతవాడై.. వెలుగుతాడూ
కలలు నిండారగా.. సిరులు కొండాడగా
అందాలా శ్రీమతికి.. మనసైనా ప్రియసతికీ
వలపుల కానుకగా.. ఒక పాపను నేనివ్వనా
మబ్బులలో విహరించే.. మా వారి అనురాగం
వాడని మందారం..  నా పాపట సిందూరం

చరణం 2 :

శౌర్యంలో నేతాజీ..  సహనంలో గాందీజీ
శాంతి గుణంలో నెహ్రూజీ..
శాంతి గుణంలో నెహ్రూజీ.. సాహసంలో శాస్త్రీజీ  
ఒరవడిగా.. వడివడిగా నీ నడవడి తీర్చి దిద్దుకుని
ఒరవడిగా..  వడివడిగా నీ నడవడి తీర్చి దిద్దుకుని 
సరిహద్దులలో పొంచిన ద్రోహుల తరిమి తరిమి కొట్టాలీ
వీర సైనికుడివై భరతావని పేరును నిలబెట్టాలీ
వందేమాతరం..  వందేమాతరం.. వందేమాతరం.. వందేమాతరం.. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి