Chinnanati Snehitulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Chinnanati Snehitulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జనవరి 2025, శనివారం

Chinnanati Snehitulu : Adagalani Vundi Song Lyrics (అడగాలని ఉంది..)

చిత్రం: చిన్ననాటి స్నేహితులు (1971)

రచన:  సి.నారాయణ రెడ్డి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

సంగీతం: టి. వి. రాజు


పల్లవి:

అడగాలని ఉంది... ఒకటడగాలని ఉంది
అడగాలని ఉంది ...ఒకటడగాలని ఉంది
అడిగిన దానికి బదులిస్తే... ఇస్తే...
అందుకు బహుమానం ఒకటుంది
అడగాలని ఉంది... ఒకటడగాలని ఉంది..ఈ...ఈ...

చరణం 1 :

ఎదురుగా నిలుచుంటే...ఎంతో ముద్దుగ మెరిసేదేది?
ఎదురుగా నిలుచుంటే...ఎంతో ముద్దుగ మెరిసేదేది?
అందీ అందకుంటే..అందీ అందకుంటే
ఇంకెంతో అందం చిందేదేది?
చేప...ఉహు..చూపు.. ఆహ..
సిగ్గు...ఉహు..మొగ్గ...ఆహ..
మొగ్గ కాదు.. కన్నెపిల్ల బుగ్గా..
అడగాలని ఉంది ...ఒకటడగాలని ఉంది
అడిగిన దానికి బదులిస్తే... ఇస్తే...
అందుకు బహుమానం ఒకటుంది
అడగాలని ఉంది... ఒకటడగాలని ఉంది..ఈ...ఈ...

చరణం 2:

కొత్తగా రుచి చూస్తుంటే...మత్తుగా ఉండేదేది?
కొత్తగా రుచి చూస్తుంటే...మత్తుగా ఉండేదేది
మళ్ళీ తలచుకుంటే...మళ్ళీ తలచుకుంటే...మరింత రుచిగా ఉండేదేది?
వెన్నా...ఉహు...జున్ను...ఉహు
తీపి ..ఉహు..ఆ పులుపు ఆహ...
పులుపు కాదూ ...తొలి వలపూ
అడగాలని ఉంది... ఒకటడగాలని ఉంది..ఈ...ఈ...
చరణం 3 :
ఎంతగా చలి వేస్తుంటే...అంతగా మనసయ్యేదేది?
ఎంతగా ... చేరదీస్తే..ఎంతగా ... చేరదీస్తే..అంతగా మురిపించేదేది?
కుంపటి...మ్మ్ హు..
దుప్పటి..ఆహ..
గొంగలి...మ్మ్ హు..
కంబళి..ఆహ..
కంబళి కాదు...కౌగిలి
అడగాలని ఉంది అది అడగాలని ఉంది
అడగాలని ఉంది అది అడగాలని ఉంది
అడగంగానే ఇచ్చేస్తే ...అడగంగానే ఇచ్చేస్తే...
అందులో రుచి ఏముంది... అహా..హ..ఆ హ..


Chinnanati Snehitulu : Andala Sreemathiki Song Lyrics (అందాలా శ్రీమతికి . .)

చిత్రం: చిన్ననాటి స్నేహితులు (1971)

రచన:  సి.నారాయణ రెడ్డి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

సంగీతం: టి. వి. రాజు



పల్లవి :

అందాలా శ్రీమతికి . . మనసైనా ప్రియసతికీ
వలపుల కానుకగా . . ఒక పాపను నేనివ్వనా
మబ్బులలో విహరించే . . మా వారి అనురాగం
వాడని మందారం . . నా పాపట సిందూరం

చరణం 1:

మా బాబు నయనాలూ.. లేత జాబిల్లి కిరణాలు
మా బాబు నయనాలూ.. లేత జాబిల్లి కిరణాలు
వీడే ఇంతవాడె అంతవాడై.. వెలుగుతాడూ
 వీడే ఇంతవాడె అంతవాడై.. వెలుగుతాడూ
కలలు నిండారగా.. సిరులు కొండాడగా
అందాలా శ్రీమతికి.. మనసైనా ప్రియసతికీ
వలపుల కానుకగా.. ఒక పాపను నేనివ్వనా
మబ్బులలో విహరించే.. మా వారి అనురాగం
వాడని మందారం..  నా పాపట సిందూరం

చరణం 2 :

శౌర్యంలో నేతాజీ..  సహనంలో గాందీజీ
శాంతి గుణంలో నెహ్రూజీ..
శాంతి గుణంలో నెహ్రూజీ.. సాహసంలో శాస్త్రీజీ  
ఒరవడిగా.. వడివడిగా నీ నడవడి తీర్చి దిద్దుకుని
ఒరవడిగా..  వడివడిగా నీ నడవడి తీర్చి దిద్దుకుని 
సరిహద్దులలో పొంచిన ద్రోహుల తరిమి తరిమి కొట్టాలీ
వీర సైనికుడివై భరతావని పేరును నిలబెట్టాలీ
వందేమాతరం..  వందేమాతరం.. వందేమాతరం.. వందేమాతరం.. 


Chinnanati Snehitulu : Emani Telupanu Ra Song Lyrics (ఏమని తెలుపను రా.. స్వామీ)

చిత్రం: చిన్ననాటి స్నేహితులు (1971)

రచన:  సి.నారాయణ రెడ్డి

గానం: పి.సుశీల

సంగీతం: టి. వి. రాజు


పల్లవి :

ఏమని తెలుపను రా.. స్వామీ
ఏమని తెలుపను రా..  ఏమని తెలుపను రా . . 
తొలిచూపులోనే ఏ గిలిగింతలాయెనో
తొలిచూపులోనే ఏ గిలిగింతలాయెనో
ఏమని తెలుపను రా..  ఏమని తెలుపను రా . . 

చరణం 1 :

చిననాటి కథలేవో తెలిపీ..  చేయి కలిపీ
కొనగోట నునుబుగ్గ మీటీ..  కన్ను గీటీ
చెమరించు నా మేను చిరుగాలి వలె తాకి.. ఆ ఆ ఆ ఆ ఆ
చెమరించు నా మేను చిరుగాలి వలె తాకి
మనసు తెలిసి మరులు కురిసి..  కన్నియ మది కరగించిన గడసరివని

ఏమని.. ఏమని.. ఏమని.. ఇంకేమనీ తెలుపను రా
ఏమని తెలుపనురా..  ఏమని తెలుపనురా

చరణం 2 :

ఎదలోని పొదరింట చేరీ.. నన్నే కోరీ
పదునైన తలపేదో రేపీ.. ఆశ చూపీ
రసలోక శిఖరాల కొసలేవొ చూపించి..  ఆ ఆ ఆ ఆ ఆ
రసలోక శిఖరాల కొసలేవొ చూపించి
ఏమనందు ఇంక ముందు.. కేరింతలు పులకింతల తేలింతూ  

ఏమని.. ఏమని..  ఏమని.. ఇంకేమనీ తెలుపను రా
ఏమని తెలుపనురా..  ఏమని తెలుపనురా


Chinnanati Snehitulu : Ekkade Ee Gadilone Song Lyrics (ఇక్కడే ఈ గదిలోనే.. )

చిత్రం: చిన్ననాటి స్నేహితులు (1971)

రచన:  సి.నారాయణ రెడ్డి

గానం: పి.సుశీల, ఘంటసాల

సంగీతం: టి. వి. రాజు



పల్లవి:

ఇక్కడే ఈ గదిలోనే.. అప్పుడే ఒకటైనప్పుడే
అలివేణి సిగపూలు ఏమన్నవో.. ఈ అలివేణి సిగపూలు ఏమన్నవో
తొలిరేయి తెలవారలేనన్నదో.. మరి ఏమన్నదో
చెప్పనా...  మళ్ళీ.. చెప్పనా
చెప్పనా.. మళ్ళీ..  చెప్పనా 

చరణం 1 :

శృతి మించెను శ్రీవారి మనసూ.. గడుసైన వయసూ . . ఓ . . ఓ . . ఓ
అగుపించెను ఆ నాటి తలపు.. అరుదైన వలపు
నీ ఓర చూపుల మధురిమలు.. నీ దోర నవ్వుల దొంతరలూ
అలనాటి రాగాలే పలికించగా.. అలనాటి రాగాలే పలికించగా
అనురాగ వీణా నిదురించునా.. నా అనురాగ వీణా నిదురించునా . .  

ఇక్కడే ఈ గదిలోనే.. అప్పుడే.. ఒకటైనప్పుడే
దొరగారి ఎదపొంగు ఏమన్నదో..  ఈ దొరగారి ఎదపొంగు ఏమన్నదో
పరువాలు విరబూసి ఏమన్నవో.. మరి ఏమన్నవో
చెప్పవే.. జాబిల్లీ చెప్పవే
చెప్పవే.. జాబిల్లీ చెప్పవే

చరణం 2 :

ఇక తీరును ఇన్నాళ్ళ వేడుకా.. ఇల్లాలి కోరికా
ఓ... ఓ... ఓ
ఉదయించును మన ఇంట భానుడు.. ఒక బాల రాముడు
ఓ.. ఓ.. ఓ
మీ నోటి పలుకే జీవనయై.. నీ తోటి బ్రతుకే పావనమై
అపరంజి కలలన్ని ఫలియించనీ.. నా అపరంజి కలలన్ని ఫలియించనీ
అందాల పాపాయి ఉందయించనీ.. ఒక అందాల పాపాయి ఉందయించనీ
చిచుల్లల్లల్లల్లల్లల్ల హాయీ.. ల్లల్లల్లల్లల్లల్ల హాయీ.. హాయీ... హాయీ

Chinnanati Snehitulu : Noomula Pandaga Song Lyrics (నోములు పండగా... )

చిత్రం: చిన్ననాటి స్నేహితులు (1971)

రచన:  సి.నారాయణ రెడ్డి

గానం: పి.సుశీల, వసంత

సంగీతం: టి. వి. రాజు


పల్లవి :

నోములు పండగా...  నూరేళ్ళు నిండగా..ఆ
పెరగాలి బంగారు నాన్నా...  నిలపాలి నీపేరు కన్నా
నోములు పండగా...  నూరేళ్ళు నిండగా..ఆ
పెరగాలి బంగారు నాన్నా...  నిలపాలి నీపేరు కన్నా 

చరణం 1 : 

చీకటినే వెలిగించే దివ్వెవు కావాలనీ...
చింతలు తొలగించే చిరునవ్వువు కావాలనీ
చీకటినే వెలిగించే దివ్వెవు కావాలనీ..
చింతలు తొలగించే చిరునవ్వువు కావాలనీ
కన్నతల్లి ఎన్ని కలలు కన్నదో..
ఎన్నెన్ని దేవతలకు మొక్కుకున్నదో 
పరమాత్మకు ప్రతిరూపం నీవనీ..
పసిడి కళల మణిదీపం నీవనీ..
పరమాత్మకు ప్రతిరూపం నీవనీ..
పసిడి కళల మణిదీపం నీవనీ..
కలలుగనీ నినుగన్న కన్నతల్లి మనసు
కడుపులో పెరిగిన ఓ కన్నా... నీకేతెలుసు
నాకన్నా నీకే తెలుసు 
నోములు పండగా...  నూరేళ్ళు నిండగా..ఆ
పెరగాలి బంగారు నాన్నా...  నిలపాలి నీపేరు కన్నా 

చరణం 2 : 

పాలిచ్చీ పాలించే ఈ తల్లీ
తల్లికాదు నీపాలి కల్పవల్లీ    
ఈ వరాల మొలకను... ఈ జాబిలి తునకను
ఈ వరాల మొలకను... ఈ జాబిలి తునకను
దీవనగా మాకిచ్చిన ఆ తల్లి...  తల్లికాదు మాపాలి కల్పవల్లి
తల్లికాదు మాపాలి కల్పవల్లి

నోములు పండగా...  నూరేళ్ళు నిండగా..ఆ
పెరగాలి బంగారు నాన్నా...  నిలపాలి నీపేరు కన్నా 

Chinnanati Snehitulu : Endukayya Navuutavu Song Lyrics (ఎందుకయ్యా నవ్వుతావు...)

చిత్రం: చిన్ననాటి స్నేహితులు (1971)

రచన:  సి.నారాయణ రెడ్డి

గానం: పి.సుశీల

సంగీతం: టి. వి. రాజు



పల్లవి :

ఎందుకయ్యా నవ్వుతావు... ఎవరు సుఖపడినారనీ...
ఎందుకయ్యా.... ఆ... ఆ
నవ్వుకోరా తనివితీరా...  ఎవ్వరేమైతేమనీ నవ్వుకోరా..ఆ 

చరణం 1 : 

నువ్వు కడుపున పడిన నాడే
నుదుటి కుంకుమ చెరిపినావే
నువ్వు కడుపున పడిన నాడే
నుదుటి కుంకుమ చెరిపినావే
నిండు వెన్నెల బాటలో
కన్నీటి చీకటి నింపినావే
ఎందుకయ్యా నవ్వుతావు... ఎవరు సుఖపడినారనీ...
ఎందుకయ్యా.... ఆ... ఆ

చరణం 2 : 

చావు బ్రతుకుల ఉందిరా... నిను చల్లగా కాపాడు దేవతా
చావు బ్రతుకుల ఉందిరా... నిను చల్లగా కాపాడు దేవతా..
ఆమే నీడయే లేని నాడు... ఆగిపోవును మనకథా
ఆగిపోవును..... మనకథా... ఆ
ఎందుకయ్యా నవ్వుతావు... ఎవరు సుఖపడినారనీ...
ఎందుకయ్యా.... ఆ... ఆ

చరణం 3 : 

నిన్ను పెంచిన కల్పవల్లీ... నిండుగా బ్రతకాలనీ
వేడుకోరా వెంకటేశుని... వేడుకోరా విశ్వనాథునీ 
వేడుకోరా... వేడుకోరా