చిత్రం: చిన్ననాటి స్నేహితులు (1971)
రచన: సి.నారాయణ రెడ్డి
గానం: పి.సుశీల
సంగీతం: టి. వి. రాజు
పల్లవి :
ఏమని తెలుపను రా.. స్వామీ
ఏమని తెలుపను రా.. ఏమని తెలుపను రా . .
తొలిచూపులోనే ఏ గిలిగింతలాయెనో
తొలిచూపులోనే ఏ గిలిగింతలాయెనో
ఏమని తెలుపను రా.. ఏమని తెలుపను రా . .
చరణం 1 :
చిననాటి కథలేవో తెలిపీ.. చేయి కలిపీ
కొనగోట నునుబుగ్గ మీటీ.. కన్ను గీటీ
చెమరించు నా మేను చిరుగాలి వలె తాకి.. ఆ ఆ ఆ ఆ ఆ
చెమరించు నా మేను చిరుగాలి వలె తాకి
మనసు తెలిసి మరులు కురిసి.. కన్నియ మది కరగించిన గడసరివని
ఏమని.. ఏమని.. ఏమని.. ఇంకేమనీ తెలుపను రా
ఏమని తెలుపనురా.. ఏమని తెలుపనురా
చరణం 2 :
ఎదలోని పొదరింట చేరీ.. నన్నే కోరీ
పదునైన తలపేదో రేపీ.. ఆశ చూపీ
రసలోక శిఖరాల కొసలేవొ చూపించి.. ఆ ఆ ఆ ఆ ఆ
రసలోక శిఖరాల కొసలేవొ చూపించి
ఏమనందు ఇంక ముందు.. కేరింతలు పులకింతల తేలింతూ
ఏమని.. ఏమని.. ఏమని.. ఇంకేమనీ తెలుపను రా
ఏమని తెలుపనురా.. ఏమని తెలుపనురా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి