11, జనవరి 2025, శనివారం

Chinnanati Snehitulu : Noomula Pandaga Song Lyrics (నోములు పండగా... )

చిత్రం: చిన్ననాటి స్నేహితులు (1971)

రచన:  సి.నారాయణ రెడ్డి

గానం: పి.సుశీల, వసంత

సంగీతం: టి. వి. రాజు


పల్లవి :

నోములు పండగా...  నూరేళ్ళు నిండగా..ఆ
పెరగాలి బంగారు నాన్నా...  నిలపాలి నీపేరు కన్నా
నోములు పండగా...  నూరేళ్ళు నిండగా..ఆ
పెరగాలి బంగారు నాన్నా...  నిలపాలి నీపేరు కన్నా 

చరణం 1 : 

చీకటినే వెలిగించే దివ్వెవు కావాలనీ...
చింతలు తొలగించే చిరునవ్వువు కావాలనీ
చీకటినే వెలిగించే దివ్వెవు కావాలనీ..
చింతలు తొలగించే చిరునవ్వువు కావాలనీ
కన్నతల్లి ఎన్ని కలలు కన్నదో..
ఎన్నెన్ని దేవతలకు మొక్కుకున్నదో 
పరమాత్మకు ప్రతిరూపం నీవనీ..
పసిడి కళల మణిదీపం నీవనీ..
పరమాత్మకు ప్రతిరూపం నీవనీ..
పసిడి కళల మణిదీపం నీవనీ..
కలలుగనీ నినుగన్న కన్నతల్లి మనసు
కడుపులో పెరిగిన ఓ కన్నా... నీకేతెలుసు
నాకన్నా నీకే తెలుసు 
నోములు పండగా...  నూరేళ్ళు నిండగా..ఆ
పెరగాలి బంగారు నాన్నా...  నిలపాలి నీపేరు కన్నా 

చరణం 2 : 

పాలిచ్చీ పాలించే ఈ తల్లీ
తల్లికాదు నీపాలి కల్పవల్లీ    
ఈ వరాల మొలకను... ఈ జాబిలి తునకను
ఈ వరాల మొలకను... ఈ జాబిలి తునకను
దీవనగా మాకిచ్చిన ఆ తల్లి...  తల్లికాదు మాపాలి కల్పవల్లి
తల్లికాదు మాపాలి కల్పవల్లి

నోములు పండగా...  నూరేళ్ళు నిండగా..ఆ
పెరగాలి బంగారు నాన్నా...  నిలపాలి నీపేరు కన్నా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి