చిత్రం: చిన్ననాటి స్నేహితులు (1971)
రచన: సి.నారాయణ రెడ్డి
గానం: పి.సుశీల, ఘంటసాల
సంగీతం: టి. వి. రాజు
పల్లవి:
ఇక్కడే ఈ గదిలోనే.. అప్పుడే ఒకటైనప్పుడే
అలివేణి సిగపూలు ఏమన్నవో.. ఈ అలివేణి సిగపూలు ఏమన్నవో
తొలిరేయి తెలవారలేనన్నదో.. మరి ఏమన్నదో
చెప్పనా... మళ్ళీ.. చెప్పనా
చెప్పనా.. మళ్ళీ.. చెప్పనా
చరణం 1 :
శృతి మించెను శ్రీవారి మనసూ.. గడుసైన వయసూ . . ఓ . . ఓ . . ఓ
అగుపించెను ఆ నాటి తలపు.. అరుదైన వలపు
నీ ఓర చూపుల మధురిమలు.. నీ దోర నవ్వుల దొంతరలూ
అలనాటి రాగాలే పలికించగా.. అలనాటి రాగాలే పలికించగా
అనురాగ వీణా నిదురించునా.. నా అనురాగ వీణా నిదురించునా . .
ఇక్కడే ఈ గదిలోనే.. అప్పుడే.. ఒకటైనప్పుడే
దొరగారి ఎదపొంగు ఏమన్నదో.. ఈ దొరగారి ఎదపొంగు ఏమన్నదో
పరువాలు విరబూసి ఏమన్నవో.. మరి ఏమన్నవో
చెప్పవే.. జాబిల్లీ చెప్పవే
చెప్పవే.. జాబిల్లీ చెప్పవే
చరణం 2 :
ఇక తీరును ఇన్నాళ్ళ వేడుకా.. ఇల్లాలి కోరికా
ఓ... ఓ... ఓ
ఉదయించును మన ఇంట భానుడు.. ఒక బాల రాముడు
ఓ.. ఓ.. ఓ
మీ నోటి పలుకే జీవనయై.. నీ తోటి బ్రతుకే పావనమై
అపరంజి కలలన్ని ఫలియించనీ.. నా అపరంజి కలలన్ని ఫలియించనీ
అందాల పాపాయి ఉందయించనీ.. ఒక అందాల పాపాయి ఉందయించనీ
చిచుల్లల్లల్లల్లల్లల్ల హాయీ.. ల్లల్లల్లల్లల్లల్ల హాయీ.. హాయీ... హాయీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి