చిత్రం: ఈశ్వర్ (2002)
సంగీతం: ఆర్.పీ.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: రాజేష్ ,ఉష
పల్లవి :
గుండెలో వాలవా చెలి చిలకా
శ్వాసలో కోరిక విన్నావుగా
కళ్లలో చేరవా తొలి వెలుగా
నీడవై చాటుగా ఉన్నావుగా
మాటలే చేతకాక సైగ చేశానుగా
సంతకం లేని లేఖా చేరనే లేదుగా
కలుసుకో త్వరగ కలలు నిజమవగా
గుండెలో వాలవా చెలి చిలకా
శ్వాసలో కోరిక విన్నావుగా
చరణం : 1
నీ వెంట తరుముతూ ఉంటే
అసలు కన్నెత్తి చూశావా నన్ను
మరి నీ ముందే తిరుగుతూ ఉంటే
ఎపుడు పన్నెత్తి పిలిచావా నన్ను
రోజు ఇలా ఈ గాలిలా నీ చెవిని తాకేది నేనేగా
మామూలుగా మాటాడక ఈ గాలి గోలేంటి చిత్రంగా
కలుసుకో త్వరగ కలలు నిజమవగా
కళ్లలో చేరవా తొలి వెలుగా
నీడవై చాటుగా ఉన్నావుగా
చరణం : 2
కాస్తైన చొరవ చేయందే వరస కలిపేదెలాగంట నీతో నువు కొంతైనా చనువు ఇవ్వందే తెలుసుకోలేను నీ సంగతేదో వెంటాడక వేటాడక వలలోన పడుతుంద వలపైనా నన్నింతగా వేధించక మన్నించి మనసివ్వు ఇపుడైనా కలుసుకో త్వరగ కలలు నిజమవగా గుండెలో వాలవా చెలి చిలకా శ్వాసలో కోరిక విన్నావుగా కళ్లలో చేరవా తొలి వెలుగా నీడవై చాటుగా ఉన్నావుగా మాటలే చేతకాక సైగ చేశానుగా సంతకం లేని లేఖా చేరనే లేదుగా కలుసుకో త్వరగ కలలు నిజమవగా కళ్లలో చేరవా తొలి వెలుగా శ్వాసలో కోరిక విన్నావుగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి