26, జనవరి 2025, ఆదివారం

Jeevana Jyothi (1975) : Endukante Emi Cheppanu Song Lyrics (ఎందుకంటే ఏమి చెప్పను...)

చిత్రం: జీవన జ్యోతి (1975)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: సి.నారాయణ రెడ్డి

గానం: ఎస్.పి. బాలసుబ్రమణ్యం



పల్లవి :

ఎందుకంటే ఏమి చెప్పను... ..ఏవిటంటే ఎలా చెప్పను...
ఎందుకంటే ఏమిచెప్పను ...ఏవిటంటే ఎలా చెప్పను
సద్దుమణిగిన ఈ వేళా ...మన మిద్దరమే వున్న వేళా
సద్దుమణిగిన ఈ వేళా...మన మిద్దరమే వున్న వేళా
తెల్లచీర తెస్తే.... మల్లెపూలు ఇస్తే
ఎందుకంటే ఏమి చెప్పను ..అందుకే అని ఎలా చెప్పను

 చరణం 1:

" అబ్భా ఎప్పుడు అదే.."
మ్యావ్...మ్యావ్...
అందాల ఓ పిల్లీ ... అరవకే నా తల్లీ
ఇపుడిపుడే కరుణించె ... చిన్నారి సిరిమల్లి
అందాల ఓ పిల్లీ...అరవకే నా తల్లీ
ఇపుడిపుడే కరుణించె ... చిన్నారి సిరిమల్లి
క్షణము దాటిందంటే ... మనసు మారునో ఏమో ..ఆ..
క్షణము దాటిందంటే .. మనసు మారునో ఏమో
అంతగా పనివుంటే .. ఆ పైన రావే... దయచేసి పోవే
మ్యావ్....మ్యావ్...
ఇంతకన్న ఏమి చెప్పను...అందుకే అని ఎలా చెప్పను


చరణం 2 :

"అబ్బా....నిద్దరొస్తుందండీ"
కొత్తగా పెళైన కోడెవయసు జంట.. కొన్నెళ్ళవరకైన నిదురే పోరాదంట
కొత్తగా పెళైన కోడెవయసు జంట.. కొన్నెళ్ళవరకైన నిదురే పోరాదంట
" మరి " ?
సుద్దులాడాలంట..
" మ్మ్..."
పొద్దుగడపాలంటా
" మ్మ్..."
ముద్దులాడాలంటా
" మ్మ్... "
మోజుతీరాలంటా ...ష్...
ఇంతకన్నా ఏమి చెప్పను..ఎందుకంటే ఏవి చెప్పను
అందుకేయని ఎలా చెప్పను...ఇంతకన్నా ఏమి చెప్పను


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి