Jeevana Jyothi (1975) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Jeevana Jyothi (1975) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, జనవరి 2025, ఆదివారం

Jeevana Jyothi (1975) : Sinni O Sinni Song Lyrics (సిన్నివో సిన్నీ.. )

చిత్రం: జీవన జ్యోతి (1975)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: సి.నారాయణ రెడ్డి

గానం: ఎస్.పి. బాలసుబ్రమణ్యం, పి.సుశీల



పల్లవి:
సిన్నివో సిన్నీ.. ఓ సన్నజాజుల సిన్ని
సిన్నివో సిన్నీ.. ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని
తుర్రుమని నువ్ వెళ్ళిపోతే.. తూరుపు దిక్కు ఆపేస్తుంది
ఉరుమురిమి చూసావంటే.. ఉత్తర దిక్కు ఊపేస్తుంది
జింజిర్ జింజిర్ జింజిర్ జిన్
సిన్నివో సిన్నీ ఓ సన్నజాజుల సిన్ని.. ఓ వన్నెగాజుల సిన్నీ కల్లబొలి మాటలతో అల్లరి పెడితే.. నన్నల్లరి పెడితే
వెల్లువ గోదారిలా కమ్మేస్తాను.. నిన్ను కమ్మేస్తాను
గోదారి పొంగల్లె నామీదికి వురికొస్తే...గొదారి పొంగల్లె నామీదికి వురికొస్తే..
రాదారి పడవల్లె తేలి తేలి పోతాను ..జింజిర్ జింజిర్ జింజిర్ జిన్
సిన్నివో సిన్నీ..ఓ సన్నజాజుల సిన్నీ... ఓ వన్నెగాజుల సిన్నీ
చరణం 1:

కొమ్మ మీది చిలకమ్మకు కులుకే అందం
ఈ కోనసీమ బుల్లెమ్మకి అలకే అందం
కొమ్మ మీది చిలకమ్మకు కులుకే అందం
ఈ కోనసీమ బుల్లెమ్మకి అలకే అందం
గుటిలోని గోరింకకు చాటు సరసం అందం
గుటిలోని గోరింకకు చాటు సరసం అందం
ఈ గుంటూరి పిలగానికి నాటు సరసం.. అందం..జింజిర్ జింజిర్ జింజిర్ జిన్ సిన్నివో సిన్నీ..ఓ సన్నజాజుల సిన్నీ.. ఓ వన్నెగాజుల సిన్నీ
చరణం 2 :
పూతరేకుల తీయదనం... నీ లేత సొగసులో వుందీ
పాలమీగడ కమ్మదనం... నీ పడుచుదనంలో వుందీ
పూతరేకుల తీయదనం... నీ లేత సొగసులో వుందీ
పాలమీగడ కమ్మదనం.. నీ పడుచుదనంలో వుందీ కోడెగిత్త పొగరంతా... నీ కొంటే వయసులో వుందీ
కోడెగిత్త పొగరంతా... నీ కొంటే వయసులో వుందీ
అందుకేనేమో....ఉ... అందుకేనేమో...
తుర్రుమని నే నెళ్ళాలంటే.. తూరుపుదిక్కు ఆపేసింది
ఉరుమురిమి చూడాలంటే.. ఉత్తరదిక్కు ఊపేసింది..జింజిర్ జింజిర్ జింజిర్ జిన్ సిన్నివో సిన్నీ.. సిన్ని ఈ సిన్ని..
నీ సన్నజాజుల సిన్ని.. నీ వన్నె గాజుల సిన్ని...
పున్నమి చంద్రునిలోనే ఈ సిన్ని.. వెన్నెలై విరబూస్తుందీ ఈ సిన్ని
సిన్నివో సిన్నీ.. ఓ సన్నజాజుల సిన్నీ..
ఓ వన్నెగాజుల సిన్నీ..ఆ..అహ హాహహ అహా
ఓ...ఒహోహో...హోహో ఓహో..

Jeevana Jyothi (1975) : Endukante Emi Cheppanu Song Lyrics (ఎందుకంటే ఏమి చెప్పను...)

చిత్రం: జీవన జ్యోతి (1975)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: సి.నారాయణ రెడ్డి

గానం: ఎస్.పి. బాలసుబ్రమణ్యం



పల్లవి :

ఎందుకంటే ఏమి చెప్పను... ..ఏవిటంటే ఎలా చెప్పను...
ఎందుకంటే ఏమిచెప్పను ...ఏవిటంటే ఎలా చెప్పను
సద్దుమణిగిన ఈ వేళా ...మన మిద్దరమే వున్న వేళా
సద్దుమణిగిన ఈ వేళా...మన మిద్దరమే వున్న వేళా
తెల్లచీర తెస్తే.... మల్లెపూలు ఇస్తే
ఎందుకంటే ఏమి చెప్పను ..అందుకే అని ఎలా చెప్పను

 చరణం 1:

" అబ్భా ఎప్పుడు అదే.."
మ్యావ్...మ్యావ్...
అందాల ఓ పిల్లీ ... అరవకే నా తల్లీ
ఇపుడిపుడే కరుణించె ... చిన్నారి సిరిమల్లి
అందాల ఓ పిల్లీ...అరవకే నా తల్లీ
ఇపుడిపుడే కరుణించె ... చిన్నారి సిరిమల్లి
క్షణము దాటిందంటే ... మనసు మారునో ఏమో ..ఆ..
క్షణము దాటిందంటే .. మనసు మారునో ఏమో
అంతగా పనివుంటే .. ఆ పైన రావే... దయచేసి పోవే
మ్యావ్....మ్యావ్...
ఇంతకన్న ఏమి చెప్పను...అందుకే అని ఎలా చెప్పను


చరణం 2 :

"అబ్బా....నిద్దరొస్తుందండీ"
కొత్తగా పెళైన కోడెవయసు జంట.. కొన్నెళ్ళవరకైన నిదురే పోరాదంట
కొత్తగా పెళైన కోడెవయసు జంట.. కొన్నెళ్ళవరకైన నిదురే పోరాదంట
" మరి " ?
సుద్దులాడాలంట..
" మ్మ్..."
పొద్దుగడపాలంటా
" మ్మ్..."
ముద్దులాడాలంటా
" మ్మ్... "
మోజుతీరాలంటా ...ష్...
ఇంతకన్నా ఏమి చెప్పను..ఎందుకంటే ఏవి చెప్పను
అందుకేయని ఎలా చెప్పను...ఇంతకన్నా ఏమి చెప్పను


Jeevana Jyothi (1975) : Ekkada Ekkada Dakkunnano Cheppuko Song Lyrics (ఎక్కడ ఎక్కడ దాక్కున్ననో చెప్పుకో.. )

చిత్రం: జీవన జ్యోతి (1975)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: సి.నారాయణ రెడ్డి

గానం: పి..సుశీల, వసంత



పల్లవి :

అమ్మా...అమ్మా
ఎక్కడ ఎక్కడ దాక్కున్ననో చెప్పుకో..
ఇక్కడ వెతికీ అక్కడ వెతికీ పట్టుకో
ఎక్కడ ఎక్కడ దాక్కున్ననో చెప్పుకో..
ఇక్కడ వెతికీ అక్కడ వెతికీ పట్టుకో
లారలల్ల లారలల్ల లారలల్ల లారలల్ల ..  అమ్మా...  అమ్మా
వస్తున్నాను ఇదిగో వస్తున్నాను..
నా చిన్నారి బాబు కోసం వస్తున్నాను
వస్తున్నాను ఇదిగో వస్తున్నాను..
నా చిన్నారి బాబు కోసం వస్తున్నాను

చరణం 1 :

రా రా రా అమ్మా రాముని కథలూ చెప్పమ్మా..
ఊ ఊ ఊ ఊ ఊ కొడుతూ వింటానమ్మా
రా రా రా అమ్మా రాముని కథలూ చెప్పమ్మా.. 
ఊ ఊ ఊ ఊ ఊ కొడుతూ వింటానమ్మా
చెబుతాను రా.. బాబు..  ఆ చిరంజీవి కథ నీకు చెబుతానురా
చెబుతాను రా.. బాబు..  ఆ చిరంజీవి కథ నీకు చెబుతానురా
బాబూ.. బాబూ.. బాబూ
లారలల్ల లారలల్ల లారలల్ల లారలల్ల..  అమ్మా..  అమ్మా

చరణం 2 :

తాతయ్యనడిగి తాయిలమొకటి తెచ్చాను..
తాతయ్యనడిగి తాయిలమొకటి తెచ్చాను
అది కాకెంగిలి చేసిస్తే కాస్తా
నువ్వు తింటావా అమ్మా తింటావా
నా బంగారు నాన్నా ఎంగిలి అయినా
అదే అమృతమనుకుంటానురా
నా బంగారు నాన్నా ఎంగిలి అయినా
అదే అమృతమనుకుంటానురా..
అదే అమృతమనుకుంటానురా 

చరణం 3 :

ఆకాశంలో దాక్కుంటే అక్కడికెట్లా వస్తావు.. 
భూమి లోపల నక్కుంటే ఏట్లా పట్టుకుంటావు
ఆకాశంలో దాక్కుంటే అక్కడికెట్లా వస్తావు..
భూమి లోపల నక్కుంటే ఏట్లా పట్టుకుంటావు
తారల నడిగీ భూదేవి నడిగి..  తారల నడిగీ భూదేవి నడిగి..
నీ జాడ తెలుసుకుంటానురా..  
నిన్ను నా గుండెలో దాచుకుంటాను రా..
నా గుండెలో దాచుకుంటాను రా


Jeevana Jyothi (1975) : Muddula Maa Baabu Song Lyrics (ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు)

చిత్రం: జీవన జ్యోతి (1975)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: సి.నారాయణ రెడ్డి

గానం: పి..సుశీల



పల్లవి: 

ష్.. ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...ష్.. 
సద్దు చేసారంటె వులికులికి పడతాడు.. 
ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు... 
సద్దు చేసారంటె వులికులికి పడతాడు.. 
గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు... 
గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు 
మా చిన్ని కన్నయ్య లోకానికె వెలుగు... జుజుజుజుజు..జుజుజుజుజు.. 
ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...ష్.. 
సద్దు చేసారంటె వులికులికి పడతాడు.. 

చరణం 1: 

చల్లగా నిదరోయే బాబు.. నిదురలో మెల్లగా నవ్వుకునే బాబు.. 
చల్లగా నిదరోయే బాబు.. నిదురలో మెల్లగా నవ్వుకునే బాబు... 
ఏమి కలలు కంటున్నాడో తెలుసా...తెలుసా... 
ఏ జన్మకు ఈ తల్లే కావాలనీ... 
ఏ జన్మకు ఈ తల్లే కావాలనీ... 
ఈ ఒడిలోనె ఆదమరచి వుండాలనీ... జుజుజుజుజు.. జుజుజుజుజు... 
ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...ష్.. 
సద్దు చేసారంటె వులికులికి పడతాడు.. 

చరణం 2: 

ఓ..ఓ..ఓ..ఓ.. 
దేవుడే నా ఎదురుగ నిలబడితే...ఏమి కావాలి తల్లీ..అని అడిగితే... 
దేవుడే నా ఎదురుగ నిలబడితే...ఏమి కావాలి తల్లీ..అని అడిగితే... 
నేనేమని అంటానో తెలుసా...తెలుసా... 
నీ నీడలో నా వాడు పెరగాలనీ... 
నీ నీడలో నా వాడు పెరగాలనీ... 
పెరిగి నీలాగే పేరు తెచ్చుకోవాలని...జుజుజుజుజు.. జుజుజుజుజు...