17, జనవరి 2025, శుక్రవారం

Kanna Koduku : Lokam Shokam Song Lyrics (లోకం..మ్మ్ శోకం..)

చిత్రం : కన్నకొడుకు (1973)

గీత రచయిత : సి.నారాయణరెడ్డి

నేపధ్య గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం : టి. చలపతిరావు



పల్లవి : 

లోకం..మ్మ్ మ్మ్ మ్మ్.. శోకం..మ్మ్ మ్మ్ మ్మ్..మనకొద్దు
లోకం..మ్మ్ మ్మ్ మ్మ్..శోకం..మ్మ్ మ్మ్ మ్మ్..మనకొద్దు
లలలాలా..ఆ... ఆ... ఆ 
మైకం... మ్మ్ మ్మ్ మ్మ్..తదేకం..మ్మ్ మ్మ్ మ్మ్..
మైకం తదేకం... వదలొద్దు..లాలాలాలాలలా
అను అను అను..హరేరామ్..అను
అను అను అను..హరేకృష్ణ అను
హరేరామ్..లాలాలాలా..హరేరామ్..లాలాలాలాలా     
రామ్ రామ్ హరేరామ్..కృష్ణ కృష్ణ ఘనశ్యామ్ 
రామ్ రామ్ హరేరామ్..కృష్ణ కృష్ణ ఘనశ్యామ్ 

చరణం 1 :

నీతి నియమం బూడిద... ఏహే
పాత సమాజం వీడర... ఏహే
నీతి నీయమం బూడిద... ఏహే
పాత సమాజం వీడర... అహో

ఇల్లూ వాకిలీ... తల్లీ తండ్రీ... ఎవరూ లేరు
ఏవరూ రారు... నీతో నేవే
నీలో నీవే... బతకాలి బతకాలి బతకాలి 

హరేరామ్..లాలాలాలా..హరేరామ్..లాలాలాలాలా     
రామ్ రామ్ హరేరామ్..కృష్ణ కృష్ణ ఘనశ్యామ్ 
రామ్ రామ్ హరేరామ్..కృష్ణ కృష్ణ ఘనశ్యామ్ 
 

చరణం 2 :

అయ్యో రామా... అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత మారాడో 
అయ్యో రామా... అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత... మారాడో
మీ భజన చేస్తూ... ఎంతకు దిగజారాడో 
 
అయ్యో రామా... అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత... మారాడో
మీ భజన చేస్తూ... ఎంతకు దిగజారాడో    
ఆడాళ్ళకు మగవాళ్ళకు... తేడా తెలియదు
అయ్య పంపే డబ్బులకే... అర్దం తెలియదు
కలసి మెలసి విందు..అహా..కైపులోన చిందు
కలసి మెలసి విందు..అహా..కైపులోన చిందు
ఈ పోకడ దగా దగా..బతుకంతా వృధా వృధా 
అయ్యో రామా..అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత..మారాడో
మీ భజన చేస్తూ..ఎంతకు దిగజారాడో    

చరణం 3 :

సౌఖ్యాలకు దొడ్డిదారి... వెతికేవాళ్ళు
బ్లాకుల్లోన లక్షలెన్నో... నూకేవాళ్ళు
పాటు పడనివాళ్ళు... సాపాటు రాయుళ్ళు
ఏ పాటు పడనివాళ్ళు... సాపాటు రాయుళ్ళు
అందరికీ మీ పేరే అతి తేరగ దొరికిందా
 
అయ్యో రామా..అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత..మారాడో
మీ భజన చేస్తూ..ఎంతకు దిగజారాడో    

చరణం 4 :

కష్టాల్లో పేదాళ్ళకు... మీరు అవసరం
కలవాళ్ళ దోపిడీకి... మీరు ఆయుధం
ఆపదలో ముడుపు... ఆపైన పరగడుపు
ఆపదలో ముడుపు... ఆపైన పరగడుపు
అనాదిగా ఇదే ఇదే..రివాజుగ సాగాలా ?     
 
అయ్యో రామా..అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత..మారాడో
మీ భజన చేస్తూ..ఎంతకు దిగజారాడో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి