17, జనవరి 2025, శుక్రవారం

Koduku Kodalu : Cheyi Cheyi Taggilindhi Song Lyrics (చేయి చేయి తగిలింది)

చిత్రం : కొడుకు కోడలు (1972)

గీత రచయిత : ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్

పల్లవి: 

చేయి చేయి తగిలింది...హాయి హాయిగా ఉంది 
పగలు రేయిగా మారింది....పరువం ఉరకలు వేసింది 
చేయి చేయి తగిలింది...హాయి హాయిగా ఉంది 
పగలు రేయిగా మారింది....పరువం ఉరకలు వేసింది 

చరణం 1: 

నా వలపే తలుపును తట్టిందీ... 
నా వలపే తలుపును తట్టిందీ... 
నీ మనసుకు మెలుకువ వచ్చింది... 
నీ వయసుకు గడియను తీసింది... 
నీ పిలుపే లోనికి రమ్మందీ... 
నీ పిలుపే లోనికి రమ్మందీ... 
నా బిడియం వాకిట ఆపింది 
నా సిగ్గే మొగ్గలు వేసింది... 
చేయి చేయి తగిలింది...హాయి హాయిగా ఉంది 
పగలు రేయిగా మారింది....పరువం ఉరకలు వేసింది 

చరణం 2: 

సిగ్గుతో నీవు నిలుచుంటే...నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే 
సిగ్గుతో నీవు నిలుచుంటే...నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే 
ఊపిరాడక నా మనసు...ఉక్కిరిబిక్కిరి అయ్యింది 
వాకిట నేను నిలుచుంటే ...ఆకలిగా నువు చూస్తుంటే 
వాకిట నేను నిలుచుంటే ...ఆకలిగా నువు చూస్తుంటే 
ఆశలు రేగి నా మనసు...అటు ఇటు గాక నలిగింది 
చేయి చేయి తగిలింది...హాయి హాయిగా ఉంది 
పగలు రేయిగా మారింది....పరువం ఉరకలు వేసింది 

చరణం 3: 

నీ చూపే మెత్తగ తాకింది... 
నీ చూపే మెత్తగ తాకింది....నా చుట్టూ మత్తును చల్లింది 
నిను చూస్తూ ఉంటే చాలంది.... 
నీ సొగసే నిలవేసింది.... 
నీ సొగసే నిలవేసింది.... 
నా మగసిరికే సరితూగింది....నా సగమును నీకు ఇమ్మంది 
లా..లా..లా..లా..లా.. 
చేయి చేయి తగిలింది...హాయి హాయిగా ఉంది 
పగలు రేయిగా మారింది....పరువం ఉరకలు వేసింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి