28, జనవరి 2025, మంగళవారం

Krishnaveni : Padunalugu yendlu Song Lyrics (పదునాలుగేండ్లు వనవాసమేగి.. )

చిత్రం: కృష్ణవేణి (1974)

సాహిత్యం: దాశరథి

గానం: పి.సుశీల

సంగీతం: విజయ భాస్కర్



పల్లవి :

పదునాలుగేండ్లు వనవాసమేగి..
మరలి వచ్చెను సీత . . 
పరమ పావని ఆ మాతా
సార్వభౌముడు శ్రీరామచంద్రుని..
సన్నిధి కోరేను సీత . .
అదే పెన్నిధి అన్నది భూజాతా

పదునాలుగేండ్లు వనవాసమేగి..
మరలి వచ్చెను సీత..
పరమ పావని ఆ మాతా 


చరణం 1 :

సత్య పరీక్షకు అగ్ని పరీక్షకు . .
సాధ్వి జానకి నిలిచె
అఖిల జగములో సీత పునీతని
అగ్నిదేవుడె పలికే . . అగ్నిదేవుడే పలికే
అల్పుని మాటలు ఆలకించెను..
న్యాయమూర్తి రఘురాముడు
ఆమె కలుషితని.. అడవికి పంపెను..
నిర్ధయుడా శ్రీరాముడూ
రాముని బాసిన సీత మనసులో రగిలెను ఆరని శోకము    

పదునాలుగేండ్లు వనవాసమేగి..
మరలి వచ్చెను సీత.. 
పరమ పావని ఆ మాత
సార్వభౌముడు శ్రీరామచంద్రుని.. 
సన్నిధి కోరేను సీత..
అదే పెన్నిధి అన్నది భూజాత  

చరణం 2 :

పూర్ణ గర్భిణికి పుణ్యరూపిణికి ఆశ్రయమొసగెను వాల్మీకి
ముని ఆశ్రమమున లవకుశ జననం..
సీతకు శాంతిని కలిగించె.. సీతకు శాంతిని కలిగించె
పతి దూషణలే తలచీ కలచీ విలపించెను ఆ మాతా
పిలిచెను భూమాతా ! తల్లి గర్భమున కలిసెను భూజాతా
జనని జానకి జీవితమంతా . . తీరని వియోగమాయే 

పదునాలుగేండ్లు వనవాసమేగి..
మరలి వచ్చెను సీత.. 
పరమ పావని ఆ మాతా
సార్వభౌముడు శ్రీరామచంద్రుని..
సన్నిధి కోరేను సీత..
అదే పెన్నిధి అన్నది భూజాతా
పదునాలుగేండ్లు వనవాసమేగి..
మరలి వచ్చెను సీత.. 
పరమ పావని ఆ మాతా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి