చిత్రం: కృష్ణవేణి (1974)
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల
సంగీతం: విజయ భాస్కర్
పల్లవి :
సంగీతం.. మధుర సంగీతం
సంగీతం.. మధుర సంగీతం . .
తల్లీ పిల్లల హృదయ సంకేతం
సంగీతం.. మధుర సంగీతం...
చరణం 1 :
ముద్దుల కూనల తీయని పిలుపే . . తల్లికి కోకిల గానం
లలల.. లాలలలా.. అహహహా.. అహహహా..
ముద్దుల కూనల తీయని పిలుపే . . తల్లికి కోకిల గానం
మదిలో మమతలె మంజుల రవళిగ.. మ్రోగును మోహనరాగం
సంగీతం . . మధుర సంగీతం . .
చరణం 2 :
బాల పాపల ఆటల పాటలె.. అమ్మకు కమ్మని గీతం
ఆకాశ వీధుల సాగే గువ్వలు.. తెచ్చే ప్రేమ సందేశం
సంగీతం.. మధుర సంగీతం
తల్లీ పిల్లల హృదయ సంకేతం
సంగీతం.. మధుర సంగీతం . .
చరణం 3 :
ఎన్నో నోముల పంటలు పండి.. ముచ్చట గొలుపు సంతానం
ఎన్నో నోముల పంటలు పండి.. ముచ్చట గొలుపు సంతానం
ఆశాఫలముల రాశులు ఎదలో చేసెను రాగసంచారం
సంగీతం.. మధుర సంగీతం . .
చరణం 4 :
శోభన జీవన దీపావళిలో.. పెరిగెను పావన తేజం
తనివే తీర తనయులజేర.. తల్లికి తరగని భాగ్యం
సంగీతం.. మధుర సంగీతం . .
తల్లీ పిల్లల హృదయ సంకేతం..
సంగీతం . . మధుర సంగీతం . .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి