చిత్రం: మనసంతా నువ్వే (2002)
సంగీతం : ఆర్.పీ.పట్నాయక్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: కె.కె., సుజాత
పల్లవి:
ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనా
అడుగు నేలపై ఆగనన్నది ఎంత ఆపుతున్నా
పిల్ల గాలితో తూగుతున్నది వింత హాయిలోన
ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనా
చరణం 1:
అటు ఇటు తిరుగుతూ కన్నులు
చిలిపి కలలను వెతుకుతూ ఉన్నవి
మదిని ఊరించు ఆశని కలుసుకోవాలనో
మధుర భావాల ఊసుని తెలుసుకోవాలనో
ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనా
చరణం 2:
తడబడు తలపుల అల్లరి
ముదిరి మనసును తరుముతూ ఉన్నది
అలలుగా తేలి నింగిని పలకరించేందుకో
అలసటే లేని ఆటలో అదుపు దాటేందుకో
ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనా
అడుగు నేలపై ఆగనన్నది ఎంత ఆపుతున్నా
పిల్ల గాలితో తూగుతున్నది వింత హాయిలోన
ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి