చిత్రం : ముద్దుల కొడుకు (1979)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
సంగీతం : కె.వి. మహదేవన్
పల్లవి :
దగాలు చేసి దిగాలు పడ్డా దసరాబుల్లోడా
సవాలు చేస్తా జవాబు చెప్పర సరదా చిన్నోడా
దగాలు చేసి దిగాలు పడ్డా దసరాబుల్లోడా
సవాలు చేస్తా జవాబు చెప్పర సరదా చిన్నోడా
చిన్నోడా..ఆ..దసరాబుల్లోడా..
చిన్నోడా..ఆ..దసరాబుల్లోడా
చరణం 1 :
మనసునే కదిలించావు... మమతలే వెలిగించావు
మనిషిలా ప్రేమించావు... ప్రేమకై జీవించావు
మనసునే కదిలించావు... మమతలే వెలిగించావు
మనిషిలా ప్రేమించావు... ప్రేమకై జీవించావు
ఆరాధనే మరచీ... అంతస్తులే వలచీ..ఈ
ఆరాధనే మరచీ... అంతస్తులే వలచీ
ఆస్తిపరుల ముద్దులకొడుకై... ఆదమరచి ఉన్నావా?
ఆత్మబలం విడిచావా?
లేదు..లేదు..మరచిపోలేదు..Never
చిన్నోడా..దసరబుల్లోడా..చిన్నోడా..దసరబుల్లోడా
దగాలుచేసి దిగాలుపడ్డా దసరాబుల్లోడా
సవాలు చేస్తా జవాబు చెప్పర సరదా చిన్నోడా
చరణం 2 :
బంగారుబాబుల ఆట... బంగారుబొమ్మల వేట
అదృష్టవంతులు పాడే... అల్లరిచిల్లరి వేలంపాట
బంగారుబాబుల ఆట... బంగారుబొమ్మల వేట
అదృష్టవంతులు పాడే... అల్లరిచిల్లరి వేలంపాట
నీ ఆటపాటలలో... నీ ఆడుగుజాడలలో..ఓఓఓ
నీ ఆటపాటలలో... నీ ఆడుగుజాడలలో..ఓఓఓ
అందాల జాబిలి బ్రతుకే... అమావాస్య చేసావా సమాధి కట్టేసావా
నేను సమాధి కట్టానా..NO..NO
ఉన్న మాటకే ఉలికిపడి... లేని మనసునే
తడుముకునే... మోసగాడు ఒక మనిషేనా..ఆ
ఏమిటి... ఏవర్ని గురించి నువ్వనేది?
నిప్పులాంటిది నీ గతం... తప్పతాగినా ఆరదు
ఎంత దాచినా దాగదు... నిన్ను దహించక తప్పదు
Stop it
తప్పదు... Stop it
తప్పదు... Stop it
తప్పదు... I Say Stop it
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి