17, జనవరి 2025, శుక్రవారం

Muddula Koduku : Okkasaari Mandhu Kottu Song Lyrics (ఒక్కసారి మందుకొట్టు...)

చిత్రం : ముద్దుల కొడుకు (1979)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్

పల్లవి :

ఇంతే సంగతులు... చిత్తగించవలెను..అహాహాహా
ఏయ్... ఒక్కసారి మందుకొట్టు మహదేవా
నిన్నొదలి పెడితే... ఒట్టు పెట్టు గురుదేవా
ఒక్కసారి మందుకొట్టు...  మహదేవా
నిన్నొదలి పెడితే... ఒట్టు పెట్టు గురుదేవా
గుటకలేసి గంతులేయ్ గురుదేవా..ఆ ఆ ఆ ఆ
చిటికేసి చిందులేయ్ మహాదేవా..ఆహా..ఆ
గుటకలేసి గంతులేయ్ గురుదేవా..ఆ ఆ
చిటికేసి చిందులేయ్ మహాదేవా..
ఒక్కసారి మందుకొట్టు...  మహదేవా
నిన్నొదలి పెడితే... ఒట్టు పెట్టు గురుదేవా

చరణం 1 :

పూనకాల స్వామికి... పానకాలు పొయ్యరా
తందనాల స్వామికి... వందనాలు చెయ్యరా
పూనకాల స్వామికి... పానకాలు పొయ్యరా
తందనాల స్వామికి... వందనాలు చెయ్యరా
వినోదానికి ఇది విందురా... మనోవ్యాధికి ఇదే మందురా..ఆహా.. హా
వినోదానికి ఇది విందురా... మనోవ్యాధికి ఇదే మందురా

ఒక్కసారి మందుకొట్టు...  మహదేవా
నిన్నొదలి పెడితే... ఒట్టు పెట్టు గురుదేవా

చరణం 2 :

తప్పతాగినోడే దానకర్ణుడు... తాగి కుప్పకూలినోడే కుంభకర్ణుడు
తప్పతాగినోడే దానకర్ణుడు... తాగి కుప్పకూలినోడే కుంభకర్ణుడు
చెప్పకు తిప్పలు మహదేవా... చేతికి చిప్పరా గురుదేవా..ఆహాహా..ఆ
చెప్పకు తిప్పలు మహదేవా... చేతికి చిప్పరా గురుదేవా
గుటకలేసి గంతులేయ్ గురుదేవా..ఆ ఆ
చిటికేసి చిందులేయ్ మహాదేవా..ఆ..హా..ఆ
ఒక్కసారి మందుకొట్టు మహదేవా
నిన్నొదలి పెడితే... ఒట్టు పెట్టు గురుదేవోయ్..గురుదేవా

చరణం 3 :

కులాసాలు మితి మీరాయంటే... కురుక్షేత్ర రణరంగాలు
విలాసాలు శృతిమించాయంటే... శివమెత్తిన శివతాండవాలు
కులాసాలు మితి మీరాయంటే... కురుక్షేత్ర రణరంగాలు
విలాసాలు శృతిమించాయంటే... శివమెత్తిన శివతాండవాలు 
శంభో శంకర మహదేవా... సాంబసదా శివ గురుదేవా
శంభో శంకర మహదేవా... సాంబసదా శివ గురుదేవా

ఒక్కసారి మందుకొట్టు...  మహదేవా
నిన్నొదలి పెడితే... ఒట్టు పెట్టు గురుదేవోయ్..గురుదేవా
గుటకలేసి గంతులేయ్ గురుదేవా..ఆ ఆ
చిటికేసి చిందులేయ్ మహాదేవా..ఆ..హా..ఆ
ఒక్కసారి మందుకొట్టు మహదేవా
నిన్నొదలి పెడితే... ఒట్టు పెట్టు గురుదేవోయ్..గురుదేవా
ఇంతే సంగతులు.. చిత్తగించవలెను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి