Muddula Koduku లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Muddula Koduku లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, జనవరి 2025, శుక్రవారం

Muddula Koduku : Chitapata Chinukula Melam Song Lyrics (చిటపట చినుకుల మేళం)

చిత్రం : ముద్దుల కొడుకు (1979)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్

పల్లవి :

చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం
అందమైన అనుభవాలకు ఇదే ఆదితాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం
అందమైన అనుభవాలకు ఇదే ఆదితాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం

చరణం 1 :

వాన చినుకు కాటేస్తే.. వయసు నిన్ను వాటేస్తే
వలపుటేరు పోటొస్తే.. వరద గట్లు తెగుతుంటే
వాన చినుకు కాటేస్తే.. వయసు నిన్ను వాటేస్తే
వలపుటేరు పోటొస్తే.. వరద గట్లు తెగుతుంటే
ముద్దముద్దగా తడిసి.. ముద్దుముద్దుగా కలిసి
ముద్దముద్దగా తడిసి.. ముద్దుముద్దుగా కలిసి
ఇద్దరమా ఒక్కదనం ఇచ్చిపుచ్చుకుంటుంటే
తహతహ తహతహ తహతహలో
తహతహ తహతహ తహతహలో
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం

చరణం 2 :

వడగళ్ళ వానలో.. వడగాలి దెబ్బలు
మనసున్న కళ్ళకే.. మసకేసే మబ్బులు
వడగళ్ళ వానలో.. వడగాలి దెబ్బలు
మనసున్న కళ్ళకే.. మసకేసే మబ్బులు
బిగిసే కౌగిళ్ళలో.. ఒకటే తబ్బిబ్బులు... హాయ్
బిగిసే కౌగిళ్ళలో.. ఒకటే తబ్బిబ్బులు
వయసున్న వాళ్ళకే.. వల్లమాలిన జబ్బులు
తహతహ తహతహ తహతహలో
తహతహ తహతహ తహతహలో
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
ఆ.. ఆ... చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం

చరణం 3 :

చలి మంటై సెగపెడుతుంటే.. చెలి జంటై సగమౌతుంటే
చలి మంటై సెగపెడుతుంటే.. చెలి జంటై సగమౌతుంటే
మన కోసం ప్రతి మాసం.. మాఘమాసమై పోతుంటే
మన ఇద్దరి మధ్యన ఏదో.. హద్దు వద్దు వద్దంటుంటే
మన ఇద్దరి మధ్యన ఏదో.. హద్దు వద్దు వద్దంటుంటే
ఈ వద్దుకు అర్ధం మారి మన హద్దులు రద్దౌతుంటే
తహతహ తహతహ తహతహలో
తహతహ తహతహ తహతహలో
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
జోరుమీద మోగింది జోడు సన్నాయి మేళం
అందమైన అనుభవాలకు ఇదే ఆదితాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం

Muddula Koduku : Cheekati Velugula Song Lyrics (చీకటి వెలుగుల చెలగాటం... )

చిత్రం : ముద్దుల కొడుకు (1979)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్

పల్లవి :

చీకటి వెలుగుల చెలగాటం... ఎండవానల కోలాటం
హద్దులు మరచిన ఆరాటం... పొద్దే ఎరగని  పోరాటం
చీకటి వెలుగుల చెలగాటం... ఎండవానల కోలాటం
హద్దులు మరచిన ఆరాటం... పొద్దే ఎరగని  పోరాటం
చీకట వెలుగుల చెలగాటం... మ్మ్

చరణం 1 :

నిద్దరనే నిద్దరపొమ్మని... నీలికళ్ళు ఎర్రగ చెపితే
కౌగిలినే కమ్ముకుపొమ్మని... కన్నెచూపు కమ్మగ చెపితే
నిద్దరనే నిద్దరపొమ్మని... నీలికళ్ళు ఎర్రగ చెపితే
కౌగిలినే కమ్ముకుపొమ్మని... కన్నెచూపు కమ్మగ చెపితే
ఎప్పటికీ తీరని వలపుల... తరిమిన కొద్దీ ఉరుముతు ఉంటే
ఎప్పటికీ తీరని వలపుల... తరిమిన కొద్దీ ఉరుముతు ఉంటే
ఆ నులివెచ్చని ముచ్చటలో... నా మనసిచ్చిన మచ్చికలో
చిమ చిమ చిమ చిమ చిమ చిమ చిమ చిమ
చీకటి వెలుగుల చెలగాటం..ఎండ వానల కోలాటం

చరణం 2 : 

సందెగాలి రిమరిమలన్నీ... చక్కలిగిలి సరిగమలైతే
సందెగాలి రిమరిమలన్నీ... చక్కలిగిలి సరిగమలైతే
సన్నజాజి ఘుమఘుమలన్నీ... చలిలో చెలి సరసాలైతే
సన్నజాజి ఘుమఘుమలన్నీ... చలిలో చెలి సరసాలైతే
పూలగాలి పులకింతలకే... పురివిప్పిన నిను చూస్తుంటే
పూలగాలి పులకింతలకే... పురివిప్పిన నిను చూస్తుంటే
కులికే నా చెలి పెదవులలో... కురిసే కుంకుమ పూవులలో
చిమ చిమ చిమ చిమ చిమ చిమ చిమ చిమ
చీకటి వెలుగుల చెలగాటం..ఎండ వానల కోలాటం

చరణం 3 : 

మొదటి ముద్దు కొసరే వేళ... ముగ్గులోకి రానంటుంటే
చివరి హద్దు దాటే వేళ... సిగ్గు సిగ్గు పడిపోతుంటే
మొదటి ముద్దు కొసరే వేళ... ముగ్గులోకి రానంటుంటే
చివరి హద్దు దాటే వేళ... సిగ్గు సిగ్గు పడిపోతుంటే
ఎవ్వరికీ దొరకని నేరం... ఇద్దరికీ వరమౌతుంటే
ఎవ్వరికీ దొరకని నేరం... ఇద్దరికీ వరమౌతుంటే
మనలో కలిగిన మైకంలో... మనమే మిగిలిన లోకంలో
చిమ చిమ చిమ చిమ చిమ చిమ చిమ చిమ
చీకటి వెలుగుల చెలగాటం... ఎండవానల కోలాటం
హద్దులు మరచిన ఆరాటం... పొద్దే ఎరగని  పోరాటం..మ్మ్ మ్మ్ మ్మ్
చీకటి వెలుగుల చెలగాటం... 

Muddula Koduku : Olole Nee Soku Song Lyrics (ఓలోలే నీ సోకు... )

చిత్రం : ముద్దుల కొడుకు (1979)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్

పల్లవి :

ఓలోలే నీ సోకు... లేలేత తమలపాకు... తాంబూలమివ్వమంటా
నా సూపే సున్నమేసి... నీ వలపే వక్క చేసి
చిలక చుట్టి ఇస్తుంటే... నీ చిటికనేలు కొరుకుతుంటా
ఆహుం..ఆహుం..ఆహుం..
ఓలేలే నా సోకు... ఈ లేత తమలపాకు... తాంబూల మిచ్చుకొంటా
అందాలే విందు చేసి..మురిపాలే ముద్దు చేసి...  చిలకచుట్టి ఇస్తుంటే
ఈ చిలిపి కొట్టూడెందుకంటా... ఆహుం..ఆహుం..ఆహుం

చరణం 1 :

ఆ సున్నమెక్కువైనా... ఈ వక్క తక్కువైనా
నీ నోరు పొక్కుతుంది... నా జోరు ఎక్కుతుంది
ఆ సున్నమెక్కువైనా... ఈ వక్క తక్కువైనా
నీ నోరు పొక్కుతుంది... నా జోరు ఎక్కుతుంది
మక్కువెక్కువైనప్పుడు పొక్కదూ..
పొక్కినా పెదవుల్లో... చక్కెర పులుపెక్కదు..ఆహా
మక్కువెక్కువైనప్పుడు... పొక్కదూ..
పొక్కినా పెదవుల్లో...  చక్కెర పులుపెక్కదు..
ఆహుం..ఆహుం..ఆహుం... ఆహుం
అరెరెరె..ఓలోలె నీ సోకు..లేలేత తమలపాకు..తాంబూలమివ్వమంటా

చరణం 2 : 

ముట్టుకొంటే ముదురుతుంది... పట్టుకొంటే పండుతుంది
కట్టుకుంటే కుదురుతుంది... కట్టుకో... కట్టుకో... కట్టుకో
ముడుపు... కట్టుకో... కట్టుకో... కట్టుకో
ముద్దు ముదిరిపోతుంటే... పొద్దు నిదరపోకుంటే
హద్దు చెదరిపోతుంటే... కట్టుకో... కట్టుకో... కట్టుకో
ముడుపు..కట్టుకో... కట్టుకో... కట్టుకో... వాయబ్బో..ఓ 
ఓలేలే నా సోకు... ఈ లేత తమలపాకు... తాంబూల మిచ్చుకొంటా... ఆఆఆ

చరణం 3 : 

నీ కుర్రకారు జోరు... నా గుండెలోన హోరు
మితిమీరిపోతే తంటా... పొలిమెర దాటకంటా
నీ కుర్రకారు జోరు... నా గుండెలోన హోరు
మితిమీరిపోతే తంటా... పొలిమెర దాటకంటా
పగ్గమేసి పట్టబోతె తగ్గదు... తగ్గినా
పడుచు ఊపు పట్టుకుంటే... చిక్కదు..ఓహా
పగ్గమేసి పట్టబోతె తగ్గదు... తగ్గినా
పడుచు ఊపు పట్టుకుంటే... చిక్కదు
ఆహుం..ఆహుం..ఆహుం..
ఓలోలే నీ సోకు... లేలేత తమలపాకు..తాంబూలమివ్వమంటా
అందాలే విందు చేసి... మురిపాలే ముద్దు చేసి చిలకచుట్టి ఇస్తుంటే
ఈ చిలిపి కొట్టూడెందుకంటా..
ఆహుం..ఆహుం..ఆహుం..ఆహుం..ఆహుం..ఆహుం

Muddula Koduku : Dagaalu Chesi Digaalu Song Lyrics (దగాలు చేసి దిగాలు పడ్డా)

చిత్రం : ముద్దుల కొడుకు (1979)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్

పల్లవి :

దగాలు చేసి దిగాలు పడ్డా దసరాబుల్లోడా
సవాలు చేస్తా జవాబు చెప్పర సరదా చిన్నోడా
దగాలు చేసి దిగాలు పడ్డా దసరాబుల్లోడా
సవాలు చేస్తా జవాబు చెప్పర సరదా చిన్నోడా
చిన్నోడా..ఆ..దసరాబుల్లోడా..
చిన్నోడా..ఆ..దసరాబుల్లోడా

చరణం 1 :

మనసునే కదిలించావు... మమతలే వెలిగించావు
మనిషిలా ప్రేమించావు... ప్రేమకై జీవించావు
మనసునే కదిలించావు... మమతలే వెలిగించావు
మనిషిలా ప్రేమించావు... ప్రేమకై జీవించావు
ఆరాధనే మరచీ... అంతస్తులే వలచీ..ఈ
ఆరాధనే మరచీ... అంతస్తులే వలచీ
ఆస్తిపరుల ముద్దులకొడుకై... ఆదమరచి ఉన్నావా?
ఆత్మబలం విడిచావా?
లేదు..లేదు..మరచిపోలేదు..Never
చిన్నోడా..దసరబుల్లోడా..చిన్నోడా..దసరబుల్లోడా
దగాలుచేసి దిగాలుపడ్డా దసరాబుల్లోడా
సవాలు చేస్తా జవాబు చెప్పర సరదా చిన్నోడా

చరణం 2 : 

బంగారుబాబుల ఆట... బంగారుబొమ్మల వేట
అదృష్టవంతులు పాడే... అల్లరిచిల్లరి వేలంపాట
బంగారుబాబుల ఆట... బంగారుబొమ్మల వేట
అదృష్టవంతులు పాడే... అల్లరిచిల్లరి వేలంపాట
నీ ఆటపాటలలో... నీ ఆడుగుజాడలలో..ఓఓఓ
నీ ఆటపాటలలో... నీ ఆడుగుజాడలలో..ఓఓఓ
అందాల జాబిలి బ్రతుకే... అమావాస్య చేసావా సమాధి కట్టేసావా
నేను సమాధి కట్టానా..NO..NO
ఉన్న మాటకే ఉలికిపడి... లేని మనసునే
తడుముకునే... మోసగాడు ఒక మనిషేనా..ఆ
ఏమిటి... ఏవర్ని గురించి నువ్వనేది?
నిప్పులాంటిది నీ గతం... తప్పతాగినా ఆరదు
ఎంత దాచినా దాగదు... నిన్ను దహించక తప్పదు
Stop it
తప్పదు... Stop it
తప్పదు... Stop it
తప్పదు... I Say Stop it

Muddula Koduku : Okkasaari Mandhu Kottu Song Lyrics (ఒక్కసారి మందుకొట్టు...)

చిత్రం : ముద్దుల కొడుకు (1979)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్

పల్లవి :

ఇంతే సంగతులు... చిత్తగించవలెను..అహాహాహా
ఏయ్... ఒక్కసారి మందుకొట్టు మహదేవా
నిన్నొదలి పెడితే... ఒట్టు పెట్టు గురుదేవా
ఒక్కసారి మందుకొట్టు...  మహదేవా
నిన్నొదలి పెడితే... ఒట్టు పెట్టు గురుదేవా
గుటకలేసి గంతులేయ్ గురుదేవా..ఆ ఆ ఆ ఆ
చిటికేసి చిందులేయ్ మహాదేవా..ఆహా..ఆ
గుటకలేసి గంతులేయ్ గురుదేవా..ఆ ఆ
చిటికేసి చిందులేయ్ మహాదేవా..
ఒక్కసారి మందుకొట్టు...  మహదేవా
నిన్నొదలి పెడితే... ఒట్టు పెట్టు గురుదేవా

చరణం 1 :

పూనకాల స్వామికి... పానకాలు పొయ్యరా
తందనాల స్వామికి... వందనాలు చెయ్యరా
పూనకాల స్వామికి... పానకాలు పొయ్యరా
తందనాల స్వామికి... వందనాలు చెయ్యరా
వినోదానికి ఇది విందురా... మనోవ్యాధికి ఇదే మందురా..ఆహా.. హా
వినోదానికి ఇది విందురా... మనోవ్యాధికి ఇదే మందురా

ఒక్కసారి మందుకొట్టు...  మహదేవా
నిన్నొదలి పెడితే... ఒట్టు పెట్టు గురుదేవా

చరణం 2 :

తప్పతాగినోడే దానకర్ణుడు... తాగి కుప్పకూలినోడే కుంభకర్ణుడు
తప్పతాగినోడే దానకర్ణుడు... తాగి కుప్పకూలినోడే కుంభకర్ణుడు
చెప్పకు తిప్పలు మహదేవా... చేతికి చిప్పరా గురుదేవా..ఆహాహా..ఆ
చెప్పకు తిప్పలు మహదేవా... చేతికి చిప్పరా గురుదేవా
గుటకలేసి గంతులేయ్ గురుదేవా..ఆ ఆ
చిటికేసి చిందులేయ్ మహాదేవా..ఆ..హా..ఆ
ఒక్కసారి మందుకొట్టు మహదేవా
నిన్నొదలి పెడితే... ఒట్టు పెట్టు గురుదేవోయ్..గురుదేవా

చరణం 3 :

కులాసాలు మితి మీరాయంటే... కురుక్షేత్ర రణరంగాలు
విలాసాలు శృతిమించాయంటే... శివమెత్తిన శివతాండవాలు
కులాసాలు మితి మీరాయంటే... కురుక్షేత్ర రణరంగాలు
విలాసాలు శృతిమించాయంటే... శివమెత్తిన శివతాండవాలు 
శంభో శంకర మహదేవా... సాంబసదా శివ గురుదేవా
శంభో శంకర మహదేవా... సాంబసదా శివ గురుదేవా

ఒక్కసారి మందుకొట్టు...  మహదేవా
నిన్నొదలి పెడితే... ఒట్టు పెట్టు గురుదేవోయ్..గురుదేవా
గుటకలేసి గంతులేయ్ గురుదేవా..ఆ ఆ
చిటికేసి చిందులేయ్ మహాదేవా..ఆ..హా..ఆ
ఒక్కసారి మందుకొట్టు మహదేవా
నిన్నొదలి పెడితే... ఒట్టు పెట్టు గురుదేవోయ్..గురుదేవా
ఇంతే సంగతులు.. చిత్తగించవలెను

Muddula Koduku : Edhalo Ragile Jwaala Song Lyrics (ఎదలో రగిలే జ్వాలా...)

చిత్రం : ముద్దుల కొడుకు (1979)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం : కె.వి. మహదేవన్

పల్లవి :

ఎదలో రగిలే జ్వాలా... ఏమని పాడను జోలా
ఎదలో రగిలే జ్వాలా... ఏమని పాడను జోలా
కన్నతల్లి కనిపించదనా... ఉన్నతల్లి కరుణించదనా
కన్నతల్లి కనిపించదనా... ఉన్నతల్లి కరుణించదనా
తల్లడిల్లి నువు ఏడ్చే వేళా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఎదలో రగిలే జ్వాలా... ఏమని పాడను జోలా

చరణం 1 :

సూర్యుడికైనా చంద్రుడికైనా... తూర్పు పడమర ఇద్దరు తల్లులూ
సూర్యుడికైనా చంద్రుడికైనా... తూర్పు పడమర ఇద్దరు తల్లులూ
ఒకరు విడిస్తే ఒకరున్నారు... ఎవరో ఒకరు లాలిస్తారు
ఒకరు విడిస్తే ఒకరున్నారు... ఎవరో ఒకరు లాలిస్తారు
బొమ్మనడిగితే నేనిస్తాను... అమ్మ నడిగితే ఏంచేస్తాను
ఎదలో రగిలే జ్వాలా... ఏమని పాడను జోలా

చరణం 2 :

బ్రతుకు చీకటై తాగిననాడు... ప్రాణం నీవై వెలిగావూ
బ్రతుకు చీకటై తాగిననాడు... ప్రాణం నీవై వెలిగావూ
మైకంలో పడి ఊగిన నాడు... మమతే నీవై ఉదయించావూ
మైకంలో పడి ఊగిన నాడు... మమతే నీవై ఉదయించావూ
అమ్మ అంటే ఎవరొస్తారు?... నాన్నా అంటూ నేనొస్తాను

ఎదలో రగిలే జ్వలా... ఏమని పాడను జోలా
కన్నతల్లి కనిపించదనా... ఉన్నతల్లి కరుణించదనా
తల్లడిల్లి నువు ఏడ్చే వేళా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఎదలో రగిలే జ్వాలా... ఏమని పాడను జోలా