17, జనవరి 2025, శుక్రవారం

Muddula Koduku : Edhalo Ragile Jwaala Song Lyrics (ఎదలో రగిలే జ్వాలా...)

చిత్రం : ముద్దుల కొడుకు (1979)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం : కె.వి. మహదేవన్

పల్లవి :

ఎదలో రగిలే జ్వాలా... ఏమని పాడను జోలా
ఎదలో రగిలే జ్వాలా... ఏమని పాడను జోలా
కన్నతల్లి కనిపించదనా... ఉన్నతల్లి కరుణించదనా
కన్నతల్లి కనిపించదనా... ఉన్నతల్లి కరుణించదనా
తల్లడిల్లి నువు ఏడ్చే వేళా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఎదలో రగిలే జ్వాలా... ఏమని పాడను జోలా

చరణం 1 :

సూర్యుడికైనా చంద్రుడికైనా... తూర్పు పడమర ఇద్దరు తల్లులూ
సూర్యుడికైనా చంద్రుడికైనా... తూర్పు పడమర ఇద్దరు తల్లులూ
ఒకరు విడిస్తే ఒకరున్నారు... ఎవరో ఒకరు లాలిస్తారు
ఒకరు విడిస్తే ఒకరున్నారు... ఎవరో ఒకరు లాలిస్తారు
బొమ్మనడిగితే నేనిస్తాను... అమ్మ నడిగితే ఏంచేస్తాను
ఎదలో రగిలే జ్వాలా... ఏమని పాడను జోలా

చరణం 2 :

బ్రతుకు చీకటై తాగిననాడు... ప్రాణం నీవై వెలిగావూ
బ్రతుకు చీకటై తాగిననాడు... ప్రాణం నీవై వెలిగావూ
మైకంలో పడి ఊగిన నాడు... మమతే నీవై ఉదయించావూ
మైకంలో పడి ఊగిన నాడు... మమతే నీవై ఉదయించావూ
అమ్మ అంటే ఎవరొస్తారు?... నాన్నా అంటూ నేనొస్తాను

ఎదలో రగిలే జ్వలా... ఏమని పాడను జోలా
కన్నతల్లి కనిపించదనా... ఉన్నతల్లి కరుణించదనా
తల్లడిల్లి నువు ఏడ్చే వేళా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఎదలో రగిలే జ్వాలా... ఏమని పాడను జోలా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి