15, జనవరి 2025, బుధవారం

Nenu Meeku Telusa : Cheppaka Thappaduga Song Lyrics (చెప్పక తప్పదుగా )

చిత్రం: నేను మీకు తెలుసా (2008)

రచన:  ఆర్.రాము

గానం: అచ్చు, సునీత సారథి

సంగీతం: అచు


పల్లవి:

చెప్పక తప్పదుగా అని అనుకోని వొచ్చా ఈ వేళా
చెబితే నువ్ ఏమంటావో తెలియదుగా
అరే ఎప్పటికప్పుడిలా ఆహ ఇప్పుడే మొదలని అనుకోవాలా
సరేలే వింటా మళ్ళీ మరో కొత్త కథలాగా

ఇంకా నెంచెప్పందే మొన్నెప్పుడో విన్నట్టే
నువ్వేదోలా వున్నావంటే వొదిలెద్దాంలే యే

ఇవ్వాళే ఈ పూటే తేల్చేద్దాం కానిలే సిద్దంగానే ఉన్నాలే

చరణం 1:

తడి తడి పెదవుల తళతళ మెరుపులు తగిలిన తనువులు విల విల లాడేలా నవ్వితే ఎలా
పొడిగా విడిగా మడిగ గోడుగా పాల తమరినిలా
కిల కిల సడి కవ్విస్తు కసిరిందో గుర్తించేదెలా
మనసేమందో వినలేదా సరిగా
నాలా నువ్వై నిలువెల్లా నిను నువ్వే గమనిస్తున్న రావే గల్లంతై పోతావే
పోనీలే క్షమించి పెచీ లెందుకులే చాలే ఎన్నాళ్ళీ దోబూచి రాజీ పడతాం ఎంచక్కా

చరణం 2:

ఎదురుగ దొరికితే కదలవు మెదలవు ఉలకవు పలకవు నిలబడి చూస్తావే ఎంత సేపిలా
అపుడు ఇపుడు ఎప్పుడు కొత్తగా వుందే ఎందుకిలా
నీ తిక మక చూస్తూ సమయమాగాలా నీకోసమలా
పరవాలేదు నువ్వు లేవా జతగా
ఆకాశంలో ఎగరేస్తానంటావా నన్నే ఆ లోకంలో ముంచేస్తానంటావా
నీ వల్లే ఇదంతా నన్నే నీ వెంట దారి తప్పించి తిప్పించి వొదిలేస్తావా ఒంటరిగా

చెప్పక తప్పదుగా అని అనుకోని వొచ్చా ఈ వేళా
చెబితే నువ్ ఏమంటావో తెలియదుగా

ఇప్పుడే మొదలని అనుకోవాలా
సరేలే వింటా మళ్ళీ మరో కొత్త కథలాగా

ఇంకా నెంచెప్పందే మొన్నెప్పుడో విన్నట్టే
నువ్వేదోలా వున్నావంటే వొదిలెద్దాంలే యే

ఇవ్వాళే ఈ పూటే తేల్చేద్దాం కానిలే సిద్దంగానే ఉన్నాలే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి