చిత్రం: నేను మీకు తెలుసా (2008)
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: శ్రీరామ్ పార్థసారథి
సంగీతం: అచు , ధరణ్
పల్లవి:
ఏమయిందొ గాని చూస్తు చూస్తు
చేజారి వెళ్ళిపోతోంది మనసెలా
ఏం మాయ వల వేస్తు వేస్తు
ఏ దారి లాగుతూ ఉందొ తననలా
అదుపులో ఉండదే చెలరేగె చిలిపితనం
అటు ఇటూ చూడదే గాలిలొ తేలి పోవడం
అనుమతి కోరదే పడి లేచె పెంకితనం
అడిగినా చెప్పదే ఎమిటో అంత అవసరం
ఎం చెయ్యడం మితిమీరే ఆరాటం
తరుముతూ వుంది ఎందుకిలా హ
ఏమయిందొ గాని చూస్తు చూస్తు
చేజారి వెళ్ళిపోతోంది మనసెలా
చరణం 1:
తప్పో ఏమో అంటుంది తప్పదు ఏమో అంటుంది తడబాటు తేలని నడక కోరే తీరం ముందుంది చేరాలంటె చేరాలి కద బెదురుతు నిలబదక సంకెళ్ళుగా సందేహం బిగిసాక ప్రయాణం కదలదు గనక అల లాలాగ మదినుయ్యాల ఊపే భావం ఏమిటో పోల్చుకో త్వరగా
చరణం 2: లోలో ఏదో నిప్పుంది దాంతో ఏదో ఇబ్బంది పడతావటె తొలి వయసా ఇన్నాళ్లుగ చెప్పంది నీతొ ఏదో చెప్పింది కద అది తెలియద మనసా చన్నీళ్లతో చల్లారను కాస్తైన సంద్రంలో రగిలెనె జ్వాల చినుకంత ముద్దు తనకందిస్తే చాలు అంతే అందిగా అంతేగా తెలుసా ఏం మాయ వల వేస్తు వేస్తు ఏ దారి లాగుతూ ఉందొ తననలా అదుపులో ఉండదే చెలరేగె చిలిపితనం అటు ఇటూ చూడదే గాలిలొ తేలి పోవడం అనుమతి కోరదే పడి లేచె పెంకితనం అడిగినా చెప్పదే ఎమిటో అంత అవసరం ఏమయిందొ గాని చూస్తు చూస్తు చేజారి వెళ్ళిపోతోంది మనసెలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి