చిత్రం: నేను మీకు తెలుసా (2008)
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: బాంబే జయశ్రీ, హేమచంద్ర
సంగీతం: అచు
ఎందుకో మది నమ్మదే ఇది
ముందున్నది నిజమంతా
నిజమే అన్న సంగతి
అవునా అంటున్నది
నన్నిలా విడిచి
ఏ లోకంలో ఉంది
మొదలైన సంతోషమో
తుది లేని సందేహమో
నువ్వే నాడు తెలుసునంది
మనసు ఎల్లాగో ఏమో
నిన్ను చూడగానే గుండెలో
ఇదేమి కలవరమో
కలలైనా రాని కనువింటి దారి
వెలిగించు కాంతి దీపం నది
నడి రేయిలోని నలుపేంత గాని
నీదైన వేకువనే వింత ఏమిటుంది
కాలం వెంట కదలలేని
శిలగా ఎన్నాళ్ళిలాగా
ఎటు వైపు అంటే
ఏ క్షణం జవాబు ఇవ్వదుగా
పడి లేవలేవా పరుగు ఆపుతావా
అడివైనా దాటి అడుగేయావా
సుడిలోని నావ కడ చేరు త్రోవ
నువ్వు చూపుతావనే ఆశ రేపుతావా
నీకే నువ్వొక ప్రశ్నగా
నిను నువ్వే వెతుక్కోకలా
నీ ఏకాంతమే కొద్దిగా నాకు పంచగా
నిన్ను ఆగనీక కొనసాగనీకా
తడబాటు ఏమిటో చెప్పలేనితనమా