చిత్రం: ఊరికి మొనగాడు (1981)
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
సంగీతం: చక్రవర్తి
పల్లవి :
అందాల జవ్వని.. మందార పువ్వని...
అందాల జవ్వని.. మందార పువ్వని...
నేనంటె నువ్వని.. నువ్వంటే నవ్వని
కలిసిందిలే కన్ను కలిసిందిలే..
తెలిసిందిలే మనసు తెలిసిందిలే
అందాల గువ్వని... రాగాల రవ్వని..
నేనంటే నువ్వని.. నువ్వంటే నవ్వని
కలిసిందిలే కన్ను కలిసిందిలే..
అందాల గువ్వని... రాగాల రవ్వని..
నేనంటే నువ్వని.. నువ్వంటే నవ్వని
కలిసిందిలే కన్ను కలిసిందిలే..
తెలిసిందిలే మనసు తెలిసిందిలే
చరణం 1 :
గోదారి నవ్వింది.. పూదారి నవ్వింది
ఆ నవ్వు ఈ నవ్వు అందాలు రువ్వింది
చిలకమ్మ నవ్వింది.. గొరవంక నవ్వింది
ఆ నవ్వు ఈ నవ్వు నెలవంకలయ్యింది
వెలుగుల్లో నీ రూపు వెన్నెళ్లు కాచే వేళ
జిలుగైన సొగసంతా సిరిపైటలేసే వేళ
చినుకంటి నీ కన్ను చిటికేసి పోయే వేళ
తెలుగుల్లో నా వలపు తొలి పాట పాడింది
అందాల గువ్వని... రాగాల రవ్వని..
చరణం 2 :
వయసొచ్చి నవ్వింది.. మనసిచ్చి నవ్వింది
వలపల్లే వాలాడు పొద్దుల్లో నవ్వింది
పూరెమ్మ నవ్వింది.. పులకింతా నవ్వింది
నూగారు బుగ్గల్లో ముగ్గల్లే నవ్వింది
నీరాటి రేవుల్లో నీడల్లు ఆడే వేళ
నాలాటి ఊహల్లే మాటొచ్చి పాడె వేళ
బంగారు మలి సంధ్య రాగాలు తీసే వేళ
మబ్బుల్లో ఓ మెరుపు నను చూసి నవ్వింది
ఆ.. అహ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి