10, జనవరి 2025, శుక్రవారం

Ooriki Monagadu : Erra Tholu Song Lyrics (ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి... )

చిత్రం: ఊరికి మొనగాడు (1981)

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

సంగీతం: చక్రవర్తి


పల్లవి :

ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి...
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి...
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
అల్లరింక ఆపకుంటే పిల్లి మెల్లో గంట కట్టి
అచ్చుపోసి పంపుతా తువ్వాయి

ఎర్ర తోలు బుంగమూతి అబ్బాయి...
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
ఎర్ర తోలు బుంగమూతి అబ్బాయి...
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
ఈత పళ్లు రాలినట్టు మూతి పళ్లు రాలగొట్టి
మూటగట్టి పంపుతా లేవోయి..
ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి...
ఎర్ర తోలు బుంగమూతి అబ్బాయి... 

చరణం 1 :

కోతి చేష్టలెక్కువైతే కోతి పిల్లవంటారు... తంతాను
పొగరుబోతు పనులు చేస్తే పోట్లగిత్తవంటారు... కొరుకుతా
ఒల్లు దగ్గరెట్టుకో... వన్నెలుంటే దిద్దుకో
ఒల్లు దగ్గరెట్టుకో... వన్నెలుంటే దిద్దుకో
అప్పుడే అందమైన ఆడపిల్లవంటారు 

కళ్లు నెత్తికెక్కితే ఒల్లు వాయగొడతారు... అబ్బా
ఒల్లు తిమ్మిరెక్కితే బడితె పూజ చేస్తారు... ఓయమ్మా
పిల్ల కాను చూసుకో... పిడుగు నేను కాసుకో...
పిల్ల కాను చూసుకో... పిడుగు నేను కాసుకో...
కాసుకో... చూసుకో... కాసుకో... చూసుకో...
ఓయె...యా.. ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి...
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
ఎర్ర తోలు బుంగమూతి అబ్బాయి...
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి 


చరణం 2 : 

ఆ.. అహా.. హహా..హా.. ఆ.. ఆ.. ఆ.. హాహా... హా
రంకెలేస్తే గిచ్చకైనా మాట తప్పదు... గిల్లుతా..ఊ..
కంకె వేస్తే చేలుకైనా కోత తప్పదు... పొడుస్తా
ముల్లు బుద్ధి మానుకో... పువ్వు లాగ మారిపో..
ముల్లు బుద్ధి మానుకో... పువ్వు లాగ మారిపో..
ముద్దుగా మచ్చటైన ముద్దబంతివంటారు...

మాపతీపి రేగితే పంపరేసి పంపుతారు... ఓహొహో..
పిచ్చి నీకు రేగితే డొక్క నీకు చింపుతారు... హహహ
పిల్ల కాను చూసుకో... పిడుగు నేను కాసుకో...
పిల్ల కాను చూసుకో... పిడుగు నేను కాసుకో...
కాసుకో... చూసుకో... కాసుకో... చూసుకో...
హో... ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి...
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
అల్లరింక ఆపకుంటే పిల్లి మెల్లో గంట కట్టి
అచ్చుపోసి పంపుతా తువ్వాయి
ఎర్ర తోలు బుంగమూతి అబ్బాయి...
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
ఈతపళ్లు రాలినట్టు మూతి పళ్లు రాలగొట్టి
మూటగట్టి పంపుతా లేవోయి..
ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి...
ఎర్ర తోలు బుంగమూతి అబ్బాయి... 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి