చిత్రం: ప్రేమికుల రోజు(2000)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: ఏ.ఎం రత్నం, శివగణేష్
గానం: ఎం.జి.శ్రీకుమార్, ఉన్ని మీనన్, కవితా కృష్ణమూర్తి
పల్లవి :
అతడు: దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈ నాడు చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈ నాడు తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ చరణం1:
అతడు:నిన్ను చూసి నన్ను నేను మరిచి చెప్పలేదు మూగబోయి నిలిచి మనసులోన దాగువున్న ఆ మాట తెలిసిందా ఆమె: నిన్ను చూసి నన్ను నేను మురిసి అసలు మాట చెప్పకుండా దాచి కళ్లతోటి సైగచేసి చెప్పాలే తెలిసిందా అతడు:ఓ..కాటుకల్లే నేను కనుల చేరుకుంటా కాటుకల్లే నేను కనుల చేరుకుంటా పూలవోలే విరిసీ నేను కురులనల్లుకుంటా ఆమె: ఓ..కళ్లలోన కాటుక కరిగిపోవునంట కురులలోన పువ్వులన్నీ వాదిపోవునంట అతడు:నీ ప్రేమ హృదయమే పొందేనా తాళిబొట్టు నీకు నే కట్టేనా ఆమె: ఈ మాట మాత్రమే నిజమైతే నా జన్మే ధన్యం అతడు:నా ప్రేమ నీవేలే ఆమె: నా ప్రేమ నీవేలే అతడు:నా ప్రేమ నీవేలే ఆమె: నా ప్రేమ నీవేలే .....
అతడు: దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈ నాడు చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈ నాడు తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా
చరణం2:
ఆమె: ప్రేమ చూపులో ఉంది మహత్యం ప్రేమ భాషలో ఉంది కవిత్వం ప్రేమించుటలో ఉన్నది దైవత్వం దైవత్వం అతడు:ప్రేమ సృష్టికే మూలపురుషుడు ప్రేమ జీవులకు పూజనీయుడు ప్రేమలేనిదే ఏమౌనో ఈ లోకం భూలోకం ఆమె:ఓ .. నా మనసె నీలో దాచి ఉంచినాను ఆ మనసె క్షేమేనా తెలుసుకొనుట వచ్చాను అతడు:ఓ..నీ మనసు పదిలంగా దాచి ఉంచినాను నాకంటే నీ మనసే నా పంచప్రాణాలు ఆమె:హృదయాలు రెండని అనలేవు ఇది నీదినాదని కనలేవు అతడు:ఈ మాటమత్రమే నిజమైతే నా జన్మే ధన్యం
అతడు:నా ప్రేమ నీవేలే
ఆమె:నా ప్రేమ నీవేలే
అతడు:నా ప్రేమ నీవేలే
యువతీ యువకుల కలయిక కోసం వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి యువతీ యువకుల కలయిక కోసం వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి మీకు తోడు మేముంటాము నేస్తమా జంకులేక ప్రేమించండి నేస్తమా మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.. మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి