23, జనవరి 2025, గురువారం

Swati Kiranam : Vaishnavi Bhargavi Song Lyrics (వైష్ణవి భార్గవి )

చిత్రం: స్వాతికిరణం(1992)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: వాణి  జయరామ్ గారు

సంగీతం: శ్రీ  కే.వి .మహాదేవన్ గారు

పల్లవి :

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే...  వింధ్య విలాసిని  వారాహి త్రిపురాంబికే
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే...  వింధ్య విలాసిని  వారాహి త్రిపురాంబికే  
భవతీ విద్యాందేహీ... భగవతి సర్వార్థసాధికే... సత్యార్థచంద్రికే
మాంపాహీ మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే 
మాంపాహీ మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే  

చరణం 1 :

ఆపాత మధురము... సంగీతము
అంచిత సంగాతము... సంచిత సంకేతము
ఆపాత మధురము... సంగీతము 
అంచిత సంగాతము...  సంచిత సంకేతము
శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము... అమృత సంపాతము... సుకృత సంపాకము
శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము...  అమృత సంపాతము... సుకృత సంపాకము
సరిగమస్వరధుని సారవరూధినీ... సామనాదవినోదినీ
సకల కళాకళ్యాణి సుహాసినీ... శ్రీ రాగాలయ వాసిని 
 
మాం పాహీ మకరంద మందాకిని
మాం పాహీ సుజ్ఞానసంవర్ధినీ 
వైష్ణవి... భార్గవి... వాగ్దేవి... త్రిగుణాత్మికే... 
వింధ్య విలాసిని...  వారాహి...  త్రిపురాంబికే 

చరణం 2 :

ఆలోచనామృతము సాహిత్యమూ... సహిత హిత సత్యము... శారదా స్తన్యము
ఆలోచనామృతము సాహిత్యమూ... సహిత హిత సత్యము... శారదా స్తన్యము 
సారస్వతాక్షర సారధ్యము... జ్ఞానసామ్రాజ్యము... జన్మసాఫల్యమూ
సారస్వతాక్షర సారధ్యము... జ్ఞానసామ్రాజ్యము... జన్మసాఫల్యమూ
సరసవక్షోభిని సారసలోచని వాణీ పుస్తకధారిణీ
వర్ణాలంకృత వైభవశాలిని వరకవితా చింతామణీ
మాం పాహీ సాలోక్య సంధాయినీ
మాం పాహీ శ్రీచక్ర సింహాసినీ...  
 
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే...  వింధ్య విలాసిని  వారాహి త్రిపురాంబికే  
భవతీ విద్యాందేహీ... భగవతి సర్వార్థసాధికే... సత్యార్థచంద్రికే
మాంపాహీ మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే 
 
కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి