చిత్రం: స్వర్ణ కమలం (1988)
సంగీతం: ఇళయరాజా
గాయకులు: ఎస్. పి. శైలజ
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
పల్లవి :
ఆ.. ఆ.. అ.. అ..
చేరి యశోదకు శిశువితడు
చేరి యశోదకు శిశువితడు
ధారుని బ్రహ్మకు తండ్రియు నితడు
చేరి యశోదకు శిశువితడూ..
ధారుని బ్రహ్మకు తండ్రియు నితడూ..ఊ..
చేరి యశోదకు శిశువితడు.. ఆ.. అ..
చరణం 1 :
సొలసి చూచినను సూర్యచంద్రులను.. లలినగ చల్లెడు లక్షణుడు..
సొలసి చూచినను సూర్యచంద్రులను.. లలినగ చల్లెడు లక్షణుడు..
నిలిచిన నిలువున నిఖిల దేవతల..
నిలిచిన నిలువున నిఖిల దేవతల..
నిలిచిన నిలువున నిఖిల దేవతల..
కలిగించు సురల గనివో ఇతడు
కలిగించు సురల గనివో ఇతడూ..ఊ..
చేరి యశోదకు శిశువితడు
దారుని బ్రహ్మకు తండ్రియునితడూ.. ఊ..
చేరి యశోదకు శిశువితడు.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి