18, జనవరి 2025, శనివారం

Undamma Bottu Pedata : Adugaduguna Gudi Undhi Song Lyrics (అడుగడుగున గుడి ఉంది..)

చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)

గీత రచయిత : దేవులపల్లి కృష్ణ శాస్త్రి

నేపధ్య గానం: పి. సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్



పల్లవి: అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం.. అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం.. అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది చరణం 1: ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ.. ఈశుని కొలువనిపించాలి ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ.. ఈశుని కొలువనిపించాలి ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి దీపం మరి మరి వెలగాలి.. తెరలూ పొరలూ తొలగాలి అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం.. అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది చరణం 2: తల్లీ తండ్రీ గురువు పెద్దలు.. పిల్లలు కొలిచే దైవం తల్లీ తండ్రీ గురువు పెద్దలు.. పిల్లలు కొలిచే దైవం కల్లా కపటం తెలియని పాపలు.. తల్లులు వలచే దైవం కల్లా కపటం తెలియని పాపలు.. తల్లులు వలచే దైవం ప్రతిమనిషీ నడిచే దైవం.. ప్రతి పులుగూ ఎగిరే దైవం.. అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం.. అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి