18, జనవరి 2025, శనివారం

Undamma Bottu Pedata : Yendhukee Sandhegaali Song Lyrics (ఎందుకీ సందెగాలి.. )

చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)

గీత రచయిత : దేవులపల్లి కృష్ణ శాస్త్రి

నేపధ్య గానం: పి. సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్



పల్లవి: ఎందుకీ సందెగాలి.. సందెగాలి తేలి మురళి ఎందుకీ సందెగాలి.. సందెగాలి తేలి మురళి తొందర తొందరలాయె.. విందులు విందులు చేసే ఎందుకీ సందెగాలి.. సందెగాలి తేలి మురళి చరణం 1: ఆగలేక నాలాగే ఊగే ఈ దీపము ఆగలేక నాలాగే ఊగే ఈ దీపము పరుగు పరుగునా త్వర త్వరగా ప్రభుని పాదముల వాలగ విందులు విందులు చేసే.. ఎందుకీ సందెగాలి సందెగాలి తేలి మురళి చరణం 2: ఏనాటిదో గాని ఆ రాధా పల్లవ పాణీ ఏమాయెనో గాని ఆ పిల్లన గ్రోవిని విని ఏనాటిదో గాని ఆ రాధా పల్లవ పాణీ ఏమాయెనో గాని ఆ పిల్లన గ్రోవిని విని.. విని.. విని.. ఏదీ ఆ... యమున యమున హృదయమున గీతిక ఏదీ బృందావన మిక.. ఏదీ విరహ గోపిక ఎందుకీ సందెగాలి.. సందెగాలి తేలి మురళి తొందర తొందరలాయె.. విందులు విందులు చేసే ఎందుకీ సందెగాలి.. సందెగాలి తేలి మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి