చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)
గీత రచయిత : దేవులపల్లి కృష్ణ శాస్త్రి
నేపధ్య గానం: ఘంటసాల, పి. సుశీల
సంగీతం : కె.వి. మహదేవన్
పల్లవి :
గంగమ్మా రా... గంగమ్మా రా... గంగమ్మా రా
పాతాళ గంగమ్మా రారారా... ఉరికురికీ ఉబికుబికీ రారారా
పగబట్టే పామల్లే పైకీ పాకీ... పరుగెత్తే జింకల్లే దూకీ దూకీ పాతాళ గంగమ్మా రారారా.... ఉరికురికీ ఉబికుబికీ రారారా
పగబట్టే పామల్లే పైకీ పాకీ.... పరుగెత్తే జింకల్లే దూకీ దూకీ
పాతాళ గంగమ్మా రారారా... చరణం 1 : వగరుస్తూ గుండే దాక పగిలింది నేలా
సెగలొచ్చీ పొగలొచ్చీ సొగసిందీ నేలా
వగరుస్తూ గుండే దాక పగిలింది నేలా
సెగలొచ్చీ పొగలొచ్చీ సొగసిందీ నేలా సోలిన ఈ చేనికీ.... సొమ్మసిల్లిన భూమికీ
సోలిన ఈ చేనికీ.... సొమ్మసిల్లిన భూమికీ
గోదారి గంగమ్మా సేద తీర్చావమ్మా పాతాళ గంగమ్మ రా రా రా... ఉరుకురికీ ఉరుకురికీ రారారా
పాతాళ గంగమ్మ రా రా రా చరణం 2 : శివమూర్తీ జఠనుండి చెదరీ వచ్చావో
శ్రీదేవి దయలాగ సిరులే తెచ్చావో
శివమూర్తీ జఠనుండి చెదరీ వచ్చావో
శ్రీదేవి దయలాగ సిరులే తెచ్చావో అడుగడుగున బంగారం... ఆకుపచ్చని శింగారం
అడుగడుగున బంగారం... ఆకుపచ్చని శింగారం
తొడగవమ్మ ఈ నేలకు సస్యశ్యామల వేసం పాతాళ గంగమ్మ రారారా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి