18, జనవరి 2025, శనివారం

Undamma Bottu Pedata : Srisailam Mallanna Sirasonchena Song Lyrics (శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా)

చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)

గీత రచయిత : దేవులపల్లి కృష్ణ శాస్త్రి

నేపధ్య గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్


పల్లవి : శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా... చేనంత గంగమ్మ వానా..
శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా... చేనంత గంగమ్మ వానా.. తిరుమలపై వెంకన్న కనువిప్పేనా... కరుణించు ఎండా వెన్నెలలైనా
తిరుమలపై వెంకన్న కనువిప్పేనా... కరుణించు ఎండా వెన్నెలలైనా ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ...
ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా... చేనంతా గంగమ్మ వానా.. చరణం 1 : కదిలొచ్చీ కలిసొచ్చీ తలుపులు తీసేరో... కలవారి కోడళ్ళు..
నడుమొంచి చెమటోర్చి... నాగళ్ళు పట్టేరు
నా జూకు దొరగారు... నాజూకు దొరగారు
అంటకుండా నలిగేనా ధాన్యాలు... వంచకుండా వంగేనా ఆ వొళ్ళూ ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ...
ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా... చేనంతా గంగమ్మ వానా.. చరణం 2 : ఏటికైన ఏతాము ఎత్తేవాళ్ళం మేమూ... అన్నదమ్ములం
ఏడేడు గరిసెల్లు నూర్చే వాళ్ళం మేము... అక్కాచెల్లెళ్ళం
ఏటికైన ఏతాము ఎత్తేవాళ్ళం మేమూ... అన్నదమ్ములం
మేమూ అన్నదమ్ములం....
ఏడేడు గరిసెల్లు నూర్చే వాళ్ళం మేము... అక్కాచెల్లెళ్ళం
మేము అక్కాచెల్లెళ్ళం.... గాజుల చేతుల్లో రాజనాలపంట
గాజుల చేతుల్లో రాజనాలపంట
కండరాలు కరిగిస్తే కరువే రాదంటా.. ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ...
ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా... చేనంతా గంగమ్మ వానా.. తిరుమలపై వెంకన్న కనువిప్పేనా... కరుణించు ఏండా వెన్నెలలైనా ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ...
ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా... చేనంతా గంగమ్మ వానా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి