చిత్రం: అమర ప్రేమ (1978)
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: చక్రవర్తి
పల్లవి :
బాల పావురమా... ఒక గూడు కడదామా
బాల పావురమా... ఒక గూడు కడదామా
నీవిలాగే నాతో రారాదా.. రారాదా.. ప్రేమించుకుందామా
బాల పావురం... ఒక గూడు కడదామా
నీవిలాగే నాతో రారాదా.. రారాదా.. ప్రేమించుకుందామా
బాల పావురం... ఒక గూడు కడదామా
చరణం 1 :
బాధలే వచ్చినా.. ఓర్చుకొందామూ
బ్రతుకులో ఆనందం.. పంచుకుందామూ.. నవ్వుకొంటూనే
బాధలే వచ్చినా.. ఓర్చుకొందామూ
బ్రతుకులో ఆనందం.. పంచుకుందామూ.. నవ్వుకొంటూనే
ఇద్దరమొకటై ఉందామూ
బాల పావురం... ఒక గూడు కడదామా
చరణం 2 :
జీవితం పున్నమిగా చేసుకుందామూ
నవ్వుతూ ఇలాగే ఏకమౌదామూ... ఆడుకుందామూ
రమ్మనీ మృత్యువూ చేరువైతేనూ
నవ్వుతూ ఇలాగే.. కలసిపోదామూ... కరిగిపోదామూ
అమరము కాదా మన ప్రేమా..
బాల పావురమా... ఒక గూడు కడదామా
నీవిలాగే నాతో రారాదా.. రారాదా.. ప్రేమించుకుందామా
బాల పావురమా... ఒక గూడు కడదామా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి