చిత్రం: అమర ప్రేమ (1978)
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: పి.సుశీల
సంగీతం: చక్రవర్తి
పల్లవి :
ఈ ప్రియురాలికి పెళ్ళే జరిగెను..ప్రేమ ఫలించేనే

ఇంక పూవల్లే గువ్వల్లే నవ్వెనూ.. ఎన్నో ఊహల్లో ఉయ్యలలూగేను

ఈ ప్రియురాలికి పెళ్ళే జరిగెను.. ప్రేమ ఫలించేనే
చరణం 1 :
పాడె నా గుండెలో నా ఊసులేవో... తీయని సంగీతం
నేడే కురిసే పూలజల్లు ఎదలో మాధుర్యం
పాడె నా గుండెలో నా ఊసులేవో..తీయని సంగీతం
నేడే కురిసే పూలజల్లు..ఎదలో మాధుర్యం..నాలో మాధుర్యం..
ఈ ప్రియురాలికి పెళ్ళే జరిగెను.. ప్రేమ ఫలించేనే
చరణం 2 :
పిలిచి నీ కళ్ళతోనే కోరుకుంటే... కలుగును ఆవేశం
వలచే నీ వయసు మేలుకుంటే... రగులును వ్యామోహం
నాలో... వ్యామోహం..