చిత్రం: అమర ప్రేమ (1978)
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
సంగీతం: చక్రవర్తి
పల్లవి :
ఆహాహాహా..ఆ..ఓహోహోహో..ఓ
ఆహా..లలలలలలలలాలా
పాల మబ్బులా తేలే గాలిలా.. రాలేవా
మోహపు జల్లులా.. పరువం రువ్వున నవ్వులా.. గువ్వలా
రాలేవా.. రావా.. రావా..రావా..
పాల మబ్బులా తేలే గాలిలా.. రాలేవా
మోహపు జల్లులా.. పరువం రువ్వున నవ్వులా.. గువ్వలా
రాలేవా..రావా..రావా..రావా..
చరణం 1 :
చిరు మెరుపులా హరివిల్లులాగ..దరిచేరవా
మంచి మాట ఉంది.. నా మనసు వింది.. వింది
కోరి కొంటే వయసు రమ్మన్నది..
చిరు మెరుపులా హరివిల్లులాగ.. దరిచేరవా
మంచి మాట ఉంది.. నా మనసు వింది.. వింది
కోరి కొంటే వయసు రమ్మన్నది..
కమ్మగా పాడమన్నదీ.. తోడుగా రావా రావా రావా
పాల మబ్బులా తేలే గాలిలా... రాలేవా
మోహపు జల్లులా.. పరువం రువ్వున నవ్వులా.. గువ్వలా
రాలేవా.. రావా.. రావా.. రావా..
చరణం 2 :
మన మనసులూ పలిపించేను సన్నాయి గానమే
ఆ పాట వింటే... తనువూగుతుంటే... వింటే
మోజులన్ని చేరి పోదామంటే
మన మనసులూ పలిపించేను సన్నాయి గానమే
ఆ పాట వింటే... తనువూగుతుంటే..వింటే
మోజులన్ని చేరి పోదామంటే
యవ్వనం పల్లవించదా జంటగా... రావా.. రావా.. రావా
పాల మబ్బులా తేలే గాలిలా... రాలేవా
మోహపు జల్లులా... పరువం రువ్వున నవ్వులా... గువ్వలా
రాలేవా.. రావా.. రావా.. రావా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి