చిత్రం : అన్నవరం (2006)
రచన : చంద్రబోస్
గానం : రమణ గోగుల
సంగీతం : రమణ గోగుల
పల్లవి :
లూసియా....
ఆకాశం నీరునిప్పు నేల ఈగాలి
నాకోసం చెప్పిందల్లా చేస్తు ఉండాలి
ఆకాశం నీరునిప్పు నేలఈగాలి
నాముందు చేతులు కట్టి దండం పెట్టాలి
చల్ చల్ చల్ సంతోషం నా ఇంట్లోనే నట్టింట్లోనే
చల్ చల్ ఆనందం ఉంది ఒంట్లోనే
చల్ చల్ ఉత్సాహం వరదయ్యే నవనాడుల్లోనే
చల్ చల్ ఉత్తేజం నేనే నేనేలే
చల్ చల్ చల్ సంతోషం నా ఇంట్లోనే నట్టింట్లోనే
చల్ చల్ ఆనందం ఉంది ఒంట్లోనే
చల్ చల్ ఉత్సాహం వరదయ్యే నవనాడుల్లోనే
చల్ చల్ ఉత్తేజం నేనే నేనేలే
లూసియా....
చరణం 1 :
నింగిలా వెలుగుతా నీటివలె పొంగిపారుతా
గాలిలా నిండుగా జ్వాలనై మంటరేపుతా
నేలలా కదులుతా లోకాన్నే కదిలించేస్తా
పంచభూతాలును నాలో చూపుతా చూపుతా
చల్ చల్ గడియారం ఉన్నది చూడు నాచేతుల్లో
చల్ చల్ నాటైమును నేనే నడిపిస్తా
చల్ చల్ పుస్తకము పెన్ను ఉంది నా గుప్పెట్లో
చల్ చల్ నా చరిత్ర నేనే రాసేస్తా
లూసియా....
చరణం 2 :
రాజునై బంటునై రెంటినీ నేనేనంటా
యుద్దము, శాంతము మద్యలో నేనేనంటా
పయనము, గమ్యము మొత్తము నేనేనంటా
నేటినై, రేపువైపు సాగుతుంటా సాగుతుంటా
చల్ చల్ నాముందు నావెనకాల నేనే ఉంటా
చల్ చల్ నాపోటీ నేనే వస్తుంటా
చల్ చల్ నాకళ్ళు నన్నే చూసి కుళ్ళేనంట
చల్ చల్ నాదిష్టి నేనే తీస్తుంటా
లూసియా....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి