17, ఫిబ్రవరి 2025, సోమవారం

Athma Gouravam : Valapulu Virisina Song Lyrics (వలపులు విరిసిన పూవ్వులె)

చిత్రం: ఆత్మ గౌరవం (1965)

సాహిత్యం: శ్రీ శ్రీ

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు

గానం: ఘంటసాల, పి. సుశీల

పల్లవి

వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే
మనసులు కలసిన చూపులె పులకించి పాడెలే

చరణం:1

బరువు కనుల నను చూడకు మరులు గొలిపి మది రేపకు

చెలి తలపే తెలిపెనులే సిగలోనిలే మల్లెలు

వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే

చరణం:2

ఉరిమిన జడిసే నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి

నీ హౄదయములో వొదిగినచో బెదురింక యేమ్మునది

వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే

చరణం:3

తొలకరి చినుకుల చిటపటలు చలి చలి గాలుల గుస గుసలు

పెదవులపై మధురిమలే చిలికించ మన్నాయిలే

వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే
మనసులు కలసిన చూపులె పులకించి పాడెలే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి