చిత్రం: భూకైలాస్ (1958)
సాహిత్యం: సముద్రాల
గానం: ఘంటసాల
సంగీతం: ఆర్.సుదర్శనం , ఆర్.గోవర్ధనం
పల్లవి :
తగునా వరమీయా ఈనీతి దూరునకు పరమా పాపునకూ
తగునా వరమీయా ఈనీతి దూరునకు పరమా పాపునకూ
స్నేహముమీరగ నీవేలగా ద్రోహము నే చేసితీ
స్నేహముమీరగ నీవేలగా ద్రోహము నే చేసితీ
పాపకర్ము దుర్మదాంధు నన్ను సేపక దయ చూపి నేలా...
హర... తగునా వరమీయా ఈనీతి దూరునకు పరమా పాపునకూ
చరణం 1:
మంగళదాయిని మాతపార్వతిని మతిమాలి మోహించితీ
మంగళదాయిని మాతపార్వతిని మతిమాలి మోహించితీ
కన్నులనిండే శూలాన పొడిచీ కామముమాపుమా
కన్నులనిండే శూలాన పొడిచీ కామముమాపుమా
తాళజాలను.. సలిపిన ఘనపాప.. సంతాప భరమీనిక
చాలును కడ తేర్చుము ఇకనైన వీని పుణ్యహీన దుర్జన్మము
ఓనాటికి మతి వేరేగతి మరిలేదూ
ఈ నీచుని తల ఇందే తునకలు కానీయ్..
వేణియద వసివాడి
మాడి మసి మసి కానీ
పాపము బాపుమా నీదయ చూపుమా నీదయ చూపుమా...
చరణం 2:
చేకొనుమా దేవా శిరము చేకొనుమా దేవా
శిరము చేకొనుమా దేవా
శిరము చేకొనుమా దేవా..
శిరము చేకొనుమా దేవా ..
చేకొనుమా దేవా శిరము... చేకొను మహాదేవా
మాలికలో మణిగా నిలుపూ
కంఠమాలికలో మణిగా... నిలుపూ
నా పాప ఫలము తరుగు విరుగు
పాప ఫలము తరుగూ విరుగూ...
పాప ఫలము తరుగూ విరుగూ
చేకొనుమా దేవా శిరము చేకొను మహాదేవా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి