BhooKhailaas లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
BhooKhailaas లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, జనవరి 2022, శుక్రవారం

BhooKhailaas : Deva Deva Dhavalachala Song Lyrics (దేవ దేవ ధవళాచల )

చిత్రం: భూకైలాస్ (1958)

సాహిత్యం: సముద్రాల

గానం: ఘంటసాల

సంగీతం: R.సుదర్శనం , R.గోవర్ధనం



దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో దురిత విమోచనా ఆఅ ఆఅ ఆఆఅ ఆఅ అ అ దురిత విమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో నమో కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో పంకజ నయనా పన్నగ శయనా ఆ ఆ ఆఆఆఅ పంకజనయనా పన్నగ శయనా పంకజనయనా పన్నగ శయనా శంకర వినుతా నమో నమో శంకర వినుతా నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో

BhooKhailaas : Neela kanta raava deva Song Lyrics (నీలకంధరా దేవా)

చిత్రం: భూకైలాస్ (1958)

సాహిత్యం: సముద్రాల

గానం: ఘంటసాల

సంగీతం: R.సుదర్శనం , R.గోవర్ధనం



జయ జయ మహాదేవ శంభో సదాశివా... ఆశ్రితమందారా శృతిశిఖర సంచారా... పల్లవి :

నీలకంధరా దేవా దీనబాంధవా రావా నన్నుగావరా నీలకంధరా దేవా దీనబాంధవా రావా నన్నుగావరా| సత్యసుందరా స్వామీ నిత్యనిర్మలా పాహీ సత్యసుందరా స్వామీ నిత్యనిర్మలా పాహీ నీలకంధరా దేవా దీనబాంధవా రావా నన్నుగావరా 

చరణం 1

అన్యదైవము గొలువా...అఅఅఅఅఅ అన్యదైవము గొలువా.. నీదుపాదము విడువా అన్యదైవము గొలువా.. నీదుపాదము విడువా దర్శనమ్మునీరా మంగళాంగ గంగాధరా దర్శనమ్మునీరా మంగళాంగ గంగాధరా నీలకంధరా దేవా దీనబాంధవా రావా నన్నుగావరా

చరణం 2

దేహియన వరములిడు దానగుణసీమా పాహియన్నను ముక్తినిడు పరంధామా నీయమమున నీ దివ్యనామ సంస్మరణా ఏమారక చేయుదును భవతాపహరణా నీ దయామయ దృష్టి దురితమ్ములార వరసుధావృష్టి నా వాంఛలీడేరా కరుణించు పరమేశ దరహాసభాసా హరహర మహాదేవ కైలాసవాసా... కైలాసవాసా

ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా జాగును సేయకయా కన్నులనిండుగ భక్తవత్సల కావగ రావయ్యా కన్నులనిండుగ భక్తవత్సల కావగ రావయ్యా ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా

ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా