25, ఏప్రిల్ 2025, శుక్రవారం

Patala Bhairavi : Kanugonagalano leno Song Lyrics (కనుగొనగలనో లేనో...)

చిత్రం: పాతాళ భైరవి (1958)

సంగీతం: ఘంటసాల

రచన: పింగళి నాగేంద్రరావు

గానం: ఘంటసాల


పల్లవి : కనుగొనగలనో లేనో...
కనుగొనగలనో లేనో... ప్రాణముతో సఖిని
కనుగొనగలనో లేనో చరణం 1 :
పెండ్లి పీటపై ప్రియనెడబాయ... గాలి మేడలు గారడి కాగా
పెండ్లి పీటపై ప్రియనెడబాయ... గాలి మేడలు గారడి కాగా
కలకాలమును కర్మను దూచుచు... కలగా బ్రతకడమేనో
కనుగొనగలనో లేనో... చరణం 2 : వెదకి వెదకి యే జాడ తెలియక... హృదయమంతా చీకటిగా
వెదకి వెదకి యే జాడ తెలియక... హృదయమంతా చీకటిగా
ఎంత పిలచినా పిలుపే అందక... చింతిలి తిరగడమేనో
కనుగొనగలనో లేనో
చరణం 3 :
పులివాతను బడు బాలహరిణియై... చెలి యెచ్చటనో చెరబడగా
పులివాతను బడు బాలహరిణియై... చెలి యెచ్చటనో చెరబడగా
జాలి లేని ఆ మాయదారికే బలిగా చేయడమేనో కనుగొనగలనో లేనో... ప్రాణముతో సఖిని
కనుగొనగలనో లేనో... కనుగొనగలనో లేనో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి