25, ఏప్రిల్ 2025, శుక్రవారం

Patala Bhairavi : Prema Kosamai Valalo Padene Papam Pasivaadu Song Lyrics (ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు)

చిత్రం: పాతాళ భైరవి (1958)

సంగీతం: ఘంటసాల

రచన: పింగళి నాగేంద్రరావు

గానం: వి.జె. వర్మ

పల్లవి :

ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు... అయ్యో పాపం పసివాడు
ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు... అయ్యో పాపం పసివాడు
వేమరు దేవుల వేడుకొని తన కొమరుని క్షేమం కోరకొనీ...
ఓ... ఓ...ఓ... ఓ... ఓ... ఓ...ఓ... ఓ...
వేమరు దేవుల వేడుకొని తన కొమరుని క్షేమం కోరుకొనీ...
ఏమైనాడో ఏమౌనోయని కుమిలే తల్లిని కుములుమనీ
ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు... అయ్యో పాపం పసివాడు

చరణం 1 :

ప్రేమకన్ననూ పెన్నిధియేమని ఏమి ధనాలిక పెట్టుననీ...
ప్రేమకన్ననూ పెన్నిధియేమని ఏమి ధనాలిక పెట్టుననీ...
సమసిచూచు ఆ రాజకుమారిని నిముషమె యుగముగ గడపుమనీ...
ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు... అయ్యో పాపం పసివాడు

చరణం 2 : 

ప్రేమలుదక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొనీ
ప్రేమలుదక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొనీ
ఏమి రాసెనో అటుకానిమ్మని బ్రహ్మదేవుదె భారమనీ...

ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు... అయ్యో పాపం పసివాడు
అయ్యో పాపం పసివాడు.... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి