Patala Bhairavi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Patala Bhairavi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, ఏప్రిల్ 2025, శుక్రవారం

Patala Bhairavi : Prema Kosamai Valalo Padene Papam Pasivaadu Song Lyrics (ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు)

చిత్రం: పాతాళ భైరవి (1958)

సంగీతం: ఘంటసాల

రచన: పింగళి నాగేంద్రరావు

గానం: వి.జె. వర్మ



పల్లవి :

ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు... అయ్యో పాపం పసివాడు
ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు... అయ్యో పాపం పసివాడు
వేమరు దేవుల వేడుకొని తన కొమరుని క్షేమం కోరకొనీ...
ఓ... ఓ...ఓ... ఓ... ఓ... ఓ...ఓ... ఓ...
వేమరు దేవుల వేడుకొని తన కొమరుని క్షేమం కోరుకొనీ...
ఏమైనాడో ఏమౌనోయని కుమిలే తల్లిని కుములుమనీ
ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు... అయ్యో పాపం పసివాడు

చరణం 1 :

ప్రేమకన్ననూ పెన్నిధియేమని ఏమి ధనాలిక పెట్టుననీ...
ప్రేమకన్ననూ పెన్నిధియేమని ఏమి ధనాలిక పెట్టుననీ...
సమసిచూచు ఆ రాజకుమారిని నిముషమె యుగముగ గడపుమనీ...
ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు... అయ్యో పాపం పసివాడు

చరణం 2 : 

ప్రేమలుదక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొనీ
ప్రేమలుదక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొనీ
ఏమి రాసెనో అటుకానిమ్మని బ్రహ్మదేవుదె భారమనీ...

ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు... అయ్యో పాపం పసివాడు
అయ్యో పాపం పసివాడు.... 

Patala Bhairavi : Kanugonagalano leno Song Lyrics (కనుగొనగలనో లేనో...)

చిత్రం: పాతాళ భైరవి (1958)

సంగీతం: ఘంటసాల

రచన: పింగళి నాగేంద్రరావు

గానం: ఘంటసాల


పల్లవి : కనుగొనగలనో లేనో...
కనుగొనగలనో లేనో... ప్రాణముతో సఖిని
కనుగొనగలనో లేనో చరణం 1 :
పెండ్లి పీటపై ప్రియనెడబాయ... గాలి మేడలు గారడి కాగా
పెండ్లి పీటపై ప్రియనెడబాయ... గాలి మేడలు గారడి కాగా
కలకాలమును కర్మను దూచుచు... కలగా బ్రతకడమేనో
కనుగొనగలనో లేనో... చరణం 2 : వెదకి వెదకి యే జాడ తెలియక... హృదయమంతా చీకటిగా
వెదకి వెదకి యే జాడ తెలియక... హృదయమంతా చీకటిగా
ఎంత పిలచినా పిలుపే అందక... చింతిలి తిరగడమేనో
కనుగొనగలనో లేనో
చరణం 3 :
పులివాతను బడు బాలహరిణియై... చెలి యెచ్చటనో చెరబడగా
పులివాతను బడు బాలహరిణియై... చెలి యెచ్చటనో చెరబడగా
జాలి లేని ఆ మాయదారికే బలిగా చేయడమేనో కనుగొనగలనో లేనో... ప్రాణముతో సఖిని
కనుగొనగలనో లేనో... కనుగొనగలనో లేనో

Patala Bhairavi : Vagaloy Vagalu Song Lyrics ( వగలోయ్ వగలూ)

చిత్రం: పాతాళ భైరవి (1958)

సంగీతం: ఘంటసాల

రచన: పింగళి నాగేంద్రరావు

గానం: జిక్కి, రేలంగి



పల్లవి:
వగలోయ్ వగలూ థళుకు బెళుకు వగలూ
వగలోయ్ వగలూ థళుకు బెళుకు వగలూ
బావలూ మామలూ బావలు మావలు భామలూ
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు
లాలలో
చరణం 1:
సింగారి వీధంట మావా... రంగేళి పిల్లంట బావా
సింగారి వీధంట మావా... రంగేళి పిల్లంట బావా
కొంగు తాకిందంటె హేయ్ హేయ్
కొంగు తాకిందంటె కూయి కూయి కూయునే
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు
వగలోయ్ వగలూ థళుకు బెళుకు వగలు
చరణం 2:
నీ వెంట వస్తాను, ఆఁ...
నీ జంట ఉంటాను... నీ వెంట వస్తాను
నీ జంట ఉంటాను... యేఁ?
సయ్యంటే బావా... ఊఁ అంటే మావా
సయ్యంటే బావా... ఊఁ అంటే మావా
చెలీయనీ భలేయని సరే యనీ చలామణి
నా వెంట మీరంతా గూమి గూమి గూడితే
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు
వగలోయ్ వగలు థళుకు బెళుకు వగలు ధీం తత తత ధీం తత తత ధీం తత తత
వగలోయ్ వగలు తలుకు బెలుకు వగలు
ఓ..ఓ..ఓ
చరణం 3:
తరిగినతక నకతక జం
ఝనంతరి తకిట ఝంతకతోం
తకిటతై తకిటతై తకిటతై తకిటతై
తలాంగుతోం తలాంగుతోం తలాంగు... తాళలేనే నే తాళలేనే
భామలారా ఓయమ్మలారా
ఇందరిలోనూ నీ సొమ్ములేవే
నా నాధుడేడే శ్రీకృష్ణుడేడే
తాళలేనే నే తాళలేనే
తాళలేనే ఓ యమ్మా
అవునే భామామణీ...
తధిగినతోం తధిగినతోం తధిగిన
తాళలేనే నే తాళలేనే
తాళలేనే నే తాళలేనే
తాళలేనే నే తాళలేనే
తాళలేనే తాళలేనే తాళలేనే...

Patala Bhairavi : Vinave Bala Naa Premagola Song Lyrics ( వినవే బాలా నా ప్రేమగోల)

చిత్రం: పాతాళ భైరవి (1958)

సంగీతం: ఘంటసాల

రచన: పింగళి నాగేంద్రరావు

గానం: రేలంగి



పల్లవి:

    వినవే బాలా నా ప్రేమగోల
    వినవే బాలా నా ప్రేమగోల
    నినుగన వేళ నిలువగజాల
    వినవే బాలా నా ప్రేమగోల
    గుబుల్ గుబుల్గా గుండెలదరగా
    దిగుల్ దిగుల్గా ఇది ఇదిగా
    గుబుల్ గుబుల్గా గుండెలదరగా
    దిగుల్ దిగుల్గా ఇది ఇదిగా
    వినవే బాలా నా ప్రేమగోల

చరణం 1:

    చిరునవ్వు చాలే చిత్తైపోతానులే
    చిరునవ్వు చాలే చిత్తైపోతానులే
    మురిపించేస్తాలే మూర్చైపోతానే
    వినవే బాలా నా ప్రేమగోల
    వినవే బాలా నా ప్రేమగోల

చరణం 2:

    జూడుగుడి తోడిరాగం పాడుకుంటు
    జూడుగుడి తోడిరాగం పాడుకుంటు
    మేడమీద పైడిబంగార్ తూగుటుయ్యాల్ వేడుకలరా
    ఊగరావా.. ఊగరావా
    చెట్టాపట్టిల్ జడకోలాటం తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
    చెట్టాపట్టిల్.. జడకోలాటం
    చెట్టాపట్టిల్ జడకోలాటం తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
    ఉప్.. ఉప్.. తొక్కుడుబిళ్ళ ఆడేనాతో.. తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
    తొక్కుడుబిళ్ళ ఆడేనాతో.. తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
    తొక్కుడుబిళ్ళ ఆడేనాతో.. తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
    ఆడేనాతో.. ఆడేనాతో.. ఆడేనాతో.. ఆడేనాతో.. ఆడేనాతో..
    ఆడేనాతో.. ఆడేనాతో.. ఆడేనాతో.. ఆడేనాతో..
    ఏయ్.. పాము.. పాము..
    ఆడేనాతో..

Patala Bhairavi : Teeyani Oohalu Song Lyrics ( తీయని ఊహలు )

చిత్రం: పాతాళ భైరవి (1958)

సంగీతం: ఘంటసాల

రచన: పింగళి నాగేంద్రరావు

గానం: పి. లీల



పల్లవి:

    తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
    వసంత నాట్యమే హాయ్ హాయ్
    తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
    వసంత నాట్యమే హాయ్ హాయ్

చరణం 1:

    చివురులదాగే తీవెలనుండి పూవులు ఘుమఘుమ నవ్వగా
    చివురులదాగే తీవెలనుండి పూవులు ఘుమఘుమ నవ్వగా
    వని అంతా పరిమళించేనే మనసంతా పరవశించెనే
    వని అంతా పరిమళించేనే మనసంతా పరవశించెనే
    తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
    వసంత నాట్యమే హాయ్ హాయ్

చరణం 2:

    గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా
    గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా
    వని అంతా జలజలరించేనే తనువెంతో పులకరించెనే
    తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
    వసంత నాట్యమే హాయ్ హాయ్

చరణం 3:

    ఓ... ఓ.... ఓ... ఓ ...
    కొత్తరాగమున కుహుకుహుమని మచ్చెలి కోయిల కూయగా
    కొత్తరాగమున కుహుకుహుమని మచ్చెలి కోయిల కూయగా
    వని అంతా రవళించేనే తనువెంతో మురిపీంచేనే
    తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
    వసంత నాట్యమే హాయ్ హాయ్

Patala Bhairavi : Entha Gaatu Premamo Song Lyircs ( ఎంత ఘాటు ప్రేమయో)

చిత్రం: పాతాళ భైరవి (1958)

సంగీతం: ఘంటసాల

రచన: పింగళి నాగేంద్రరావు

గానం: ఘంటసాల,పి. లీల



పల్లవి:

    ఎంత ఘాటు ప్రేమయో
    ఎంత తీవ్రమీక్షణమో ఓ..
    ఎంత ఘాటు ప్రేమయో
    కన్ను చాటు చిన్నదిగా కళలు విరిసెనే
    నా మనసు మురిసెనే...
   ఎంత ఘాటు ప్రేమయో
    ఎంత తీవ్రమీక్షణమో ఓ..
    ఎంత ఘాటు ప్రేమయో
    కన్ను చాటు చిన్నదిగా కళలు విరిసెనే
    నా మనసు మురిసెనే...
    ఎంత ఘాటు ప్రేమయో
    ఎంత లేత వలపులో
    ఎంత చాటు మోహములో ఓ..
    ఎంత లేత వలపులో
    కన్నులలో కనినంతనే తెలిసిపోయెనే
    నా మనసు నిలిచెనే 
   ఎంత లేత వలపులో
    ఎంత చాటు మోహములో ఓ..
    ఎంత లేత వలపులో
    కన్నులలో కనినంతనే తెలిసిపోయెనే
    నా మనసు నిలిచెనే 
    యెంత లేత వలపులో

చరణం 1:

    ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ 
    ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ 
    విరహములో వివరాలను విప్పి జెప్పెనే
    ఎంత ఘాటు ప్రేమయో

చరణం 2:

    ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా 
    ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా 
    ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయవే
    ఎంత లేత వలపులో
    ఎంత చాటు మోహములో ఓ..
    ఎంత లేత వలపులో...

17, ఆగస్టు 2022, బుధవారం

Patala Bhairavi : Kalavaramaye Song Lyrics (కలవరమాయే మదిలో నా మదిలో)

చిత్రం: పాతాళ భైరవి (1958)

సంగీతం: ఘంటసాల

రచన: పింగళి నాగేంద్రరావు

గానం: ఘంటసాల,పి. లీల



పల్లవి:

    కలవరమాయే మదిలో నా మదిలో
    కలవరమాయే మదిలో నా మదిలో
    కన్నులలోన కలలే ఆయే
    మనసే ప్రేమ మందిరమాయే
    కలవరమాయే మదిలో నా మదిలో
    కలవరమాయ మదిలో నా మదిలో
    కలవరమాయ మదిలో నా మదిలో
    కన్నులలోన గారడి ఆయే
    మనసే పూల మంటపమాయే
    కలవర మాయే మదిలో నా మదిలో

చరణం 1:

    నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది
    నాలో ఏమో నవ భావనగామెల్లన వీణ మ్రోగింది
    అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే
    కలవరమాయే మదిలో నా మదిలో

చరణం 2:

    నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది
    నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది
    మోహాలేవో మోసులు వేసి ఊహాగానము చేసే
    కలవరమాయే మదిలో నా మదిలో
    కన్నులలోన కలలే ఆయే
    మనసే ప్రేమ మందిరమాయే
    కలవరమాయే మదిలో నా మదిలో
    కలవరమాయే మదిలో నా మదిలో

15, ఫిబ్రవరి 2022, మంగళవారం

Patala Bhairavi : Pranaya Jeevulaku Haayiga Song Lyrics (ప్రణయజీవులకు దేవివరాలే)

చిత్రం: పాతాళ భైరవి (1958)

సంగీతం: ఘంటసాల

రచన: పింగళి నాగేంద్రరావు

గానం: ఘంటసాల,పి. లీల



పల్లవి:

    ప్రణయజీవులకు దేవివరాలే....
    కానుకలివియే ప్రియురాలా...
    హాయిగా మనకింక స్వేచ్ఛగా...
    హాయిగా మనకింక స్వేచ్ఛగా...
    హాయిగా...

చరణం 1:

    చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా...
    చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా...
    కలసిమెలసి పోదమో వలపుబాటన...
    హాయిగా మనకింక స్వేచ్ఛగా...
    హాయిగా...

చరణం 2:

    నీ వలపు నా వలపు పూలమాలగా ఆ... ఆ... ఆ...
    నీ వలపు నా వలపు పూలమాలగా ఆ... ఆ... ఆ...
    నీవు నేను విడివడని ప్రేమమాలగా...
    హాయిగా మనకింక స్వేచ్ఛగా...
    హాయిగా...

చరణం 3:

    కలలు నిజముకాగా కలకాలమొకటిగా...
    కలలు నిజముకాగా కలకాలమొకటిగా...
    తెలియరాని సుఖములలో తేలిపోవగా...
    హాయిగా మనకింక స్వేచ్ఛగా...
    హాయిగా మనకింక స్వేచ్ఛగా...
    హాయిగా ... స్వేచ్ఛగా...
    హాయిగా