చిత్రం: బొబ్బిలి సింహం (1994)
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
పల్లవి:
కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల
ఇద్దరూ పడ్డారు నా పాలా
కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల
ఇద్దరూ పడ్డారు నా పాలా
బేలా ఐదేలా పాలా అంబాల
తబలాకి తైతక్క నాకేలా
అతివల అందాల అడ కత్తెరా
ఇరుకున పెడుతుంటే ఏం మత్తురా
గోపాలా... కోక కోలా
కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల
ఇద్దరూ పడ్డారు నా పాలా
బేలా ఐదేలా పాలా అంబాల
తబలాకి తైతక్క నాకేలా
చరణం 1:
చోలీకే పీచే దాసే శోభనాల పొంగుల్తో
ఖాళీగా ఉన్నానేను కౌగిలిస్తావా
లాల్చీతో పేచీవస్తే లోగిరాకి బేరంలో
వాల్చి నా మంచమెక్కి ఒళ్ళు పడతావా
హే అలివేణి చలి ఓణీ తొలి బోణీ సుఖీమణి
పొదరాని కథలన్నీ నడిపించవే
మగసిరి దీపాలు మరుమల్లేలా
గోపాలా... రాధా లోలా
కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల
ఇద్దరూ పడ్డారు నా పాలా
బేలా ఐదేలా పాలా అంబాల
తబలాకి తైతక్క నాకేలా
చరణం 2:
జోడీగా గుమ్మలోచ్చి జోరు చేసే వేళల్లో నారీ ఈ బ్రహ్మచారి ప్యారికొస్తావా లౌలీగా లాటికొచ్చే ఈ గులాబి తోటల్లో నారైక ముళ్ళు మీద ముద్దు పెడతావా హే విరజాజి విరహాల తొలిపేజి భలే కసి పెనవేసి తొణతీసి రుచిచూడనా పురుషుడి పుట్టిల్లు పులకింతలా గోపాలా... తపాలేలా కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల ఇద్దరూ పడ్డారు నా పాలా బేలా ఐదేలా పాలా అంబాల తబలాకి తైతక్క నాకేలా హే కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల ఇద్దరూ పడ్డారు నా పాలా బేలా ఐదేలా పాలా అంబాల తబలాకి తైతక్క నాకేలా