Bullemma Bullodu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bullemma Bullodu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జనవరి 2022, బుధవారం

Bullemma Bullodu : Amma annadi Song Lyrics ( అమ్మ అన్నది)

చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972)

సాహిత్యం: దాశరథి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బెంగళూరు లత

సంగీతం: సి. సత్యం




పల్లవి: అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతలమూట అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా ...మమతలమూట చరణం 1: దేవుడే లేడనె మనిషున్నాడు అమ్మేలేదను వాడు అసలే లేడు దేవుడే లేడనె మనిషున్నాడు అమ్మేలేదను వాడు అసలే లేడు తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు ఆ తల్లి సేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా..మమతలమూట చరణం 2:

అమ్మంటే అంతులేనె సొమ్మురా అది ఏనాటికి తరగనె భాగ్యమ్మురా అమ్మ మనసు అమృతమే చిందురా' అమ్మ ఓడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా...మమతలమూట

Bullemma Bullodu : Kurisindi Vaana Song Lyrics (కురిసింది వాన)

చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972)

సాహిత్యం: రాజశ్రీ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: సి. సత్యం



కురిసింది వాన.... నా గుండె లోన.... నీ చూపులే జల్లుగా ....... కురిసింది వాన.... నా గుండె లోన.... నీ చూపులే జల్లుగా... ముసిరే మేఘాలు కొసరే రాగాలు కురిసింది వాన.... నా గుండె లోన.... నీ చూపులే జల్లుగా... అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను... తొలకరి వయసు గడసరి మనసు నీ జత కోరేను .... అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను... చలి గాలి వీచే గిలిగింత తోచే కురిసింది వాన.... నా గుండె లోన.... నీ చూపులే జల్లుగా... ఉరకలు వేసే ఊహలు నాలో గుసగుసలాడే ను.... కథలను తెలిపే కాటుక కళ్ళు కైపులు రేపేను .. ఉరకలు వేసే ఊహలు నాలో గుసగుసలాడే ను.... బిగువు ఇంకెలా దరికి రావేలా .... కురిసింది వాన.... నా గుండె లోన.... నీ చూపులే జల్లుగా... ముసిరే మేఘాలు కొసరే రాగాలు కురిసింది వాన.... నా గుండె లోన.... నీ చూపులే జల్లుగా...