Devatha(1965) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Devatha(1965) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జనవరి 2022, బుధవారం

Devatha : Kannullo Misamisalu Song Lyrics ( కన్నుల్లో మిసమిసలు)

చిత్రం: దేవత (1965)

సాహిత్యం: వేటూరి

గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం: యస్.పి. కోదండపాణి




కన్నుల్లో మిసమిసలు కనిపించనీ గుండెల్లో గుసగుసలు వినిపించనీ కన్నుల్లో మిసమిసలు కనిపించనీ నీ చూపుతో నన్ను ముడివేయకూ ఈ పూలు వింతాయె తడిచేయకూ నీ చూపుతో నన్ను ముడివేయకూ సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది నా పైట చెంగు లాగీ కవ్వించకు సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది నా పైట చెంగు లాగీ కవ్వించకు అనువైన వేళ అందాలు దాచకూ అనువైన వేళ అందాలు దాచకూ అణువణువు నిన్నే కోరే మురిపించకూ ఇకనైన నునుసిగ్గు తెరవేయకూ నీ చూపుతో నన్ను ముడివేయకూ ఈ పూలు వింతాయె తడిచేయకూ కన్నుల్లో మిసమిసలు కనిపించనీ ఎటు చూసినా నువ్వే వినిపించె నీ నవ్వే  మోహాలతో నన్ను మంత్రించకూ ఎటు చూసినా నువ్వే వినిపించె నీ నవ్వే  మోహాలతో నన్ను మంత్రించకూ మనలోని ప్రేమా మారాకు వేయనీ మనలోని ప్రేమా మారాకు వేయనీ మనసారా ఒడిలో నన్ను నిదురించనీ నీ నీలి ముంగురులు సవరించనీ నీ చూపుతో నన్ను ముడివేయకూ ఈ పూలు వింతాయె తడిచేయకూ కన్నుల్లో మిసమిసలు కనిపించనీ గుండెల్లో గుసగుసలు వినిపించనీ కన్నుల్లో మిసమిసలు కనిపించనీ

17, జనవరి 2022, సోమవారం

Devatha : Aalayana Velasina Song Lyrics (ఆలయాన వెలిసిన )

చిత్రం: దేవత (1965)

సాహిత్యం: వేటూరి

గానం: ఘంటసాల

సంగీతం: యస్.పి. కోదండపాణి



ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి పతిదేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన కష్టసుఖాలలో తోడూ నీడగా తల్లిని మరిపించే యిల్లాలి ఆదరణ కష్టసుఖాలలో తోడూ నీడగా తల్లిని మరిపించే యిల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావనా ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి సేవలతో అత్తమామ సంతసించగా పదిమందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్తమామ సంతసించగా పదిమందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమను గాచె దేవతగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమను గాచె దేవతగా సృష్టించెను దేవుడు తనకుమాళిగ

ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి