17, జనవరి 2022, సోమవారం

Devatha : Aalayana Velasina Song Lyrics (ఆలయాన వెలిసిన )

చిత్రం: దేవత (1965)

సాహిత్యం: వేటూరి

గానం: ఘంటసాల

సంగీతం: యస్.పి. కోదండపాణి



ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి పతిదేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన కష్టసుఖాలలో తోడూ నీడగా తల్లిని మరిపించే యిల్లాలి ఆదరణ కష్టసుఖాలలో తోడూ నీడగా తల్లిని మరిపించే యిల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావనా ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి సేవలతో అత్తమామ సంతసించగా పదిమందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్తమామ సంతసించగా పదిమందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమను గాచె దేవతగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమను గాచె దేవతగా సృష్టించెను దేవుడు తనకుమాళిగ

ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి











కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి