చిత్రం: దేవి పుత్రుడు (2001)
రచన: జొన్న విత్తుల రామలింగేశ్వర రావు
గానం: ఉదిత్ నారాయణ్, కె.యస్.చిత్ర
సంగీతం: మణి శర్మ
తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళ
తెల్లా తెల్లారి దాకా చెయ్యమన్నాది కుంభమేళ
తాకితే సితారా శృంగార శుక్ర తార
నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా
తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళ
తెల్లా తెల్లారి దాకా చెయ్యమన్నాది కుంభమేళ
చరణం : 1
ప్రేమ గురువా ఊగరావా
పూల పొద ఉయ్యాలా
హంస లలనా చేరుకోనా కోరికల తీరాన
గొడవే నిరంతరం
ఇరువురి దరువే సగం సగం
పిలుపే ప్రియం ప్రియం
తకధిమి తపనే తళాంగు తోం తోం తోం
ఇంద్రధనసు మంచం
ఇమ్మంది వయసు లంచం
పిల్ల నెమలి పింఛం
అది అడిగెను మరి కొంచె
తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళ
తెల్లా తెల్లారి దాకా చెయ్యమన్నాది కుంభమేళ
చరణం : 2
ప్రియ వనితా చీర మడత
చక్కచేసి ఒక్కటవనా
మీద పడనా మీగడవనా
కన్నె ఎద రాగాలా
రగిలే గులాబివే
మదనుడి సభకే నవాబువే
తగిలే సుఖానివే బిగువుల బరిలో
విహారివే... హోయ్ హోయ్ హోయ్
శోభనాల బాల ముందుందే ఇంక చాలా
జాజులా మజాలా పూగంధం పూయాలా
తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళ
తెల్లా తెల్లారి దాకా చెయ్యమన్నాది కుంభమేళ
తాకితే సితారా శృంగార శుక్ర తార
నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి